Tollywood : మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

- Advertisement -

Tollywood లో ఈమధ్య కాలం లో విడుదలైన కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి భారీ లాభలను తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే కేవలం మూడు రోజుల్లోపే Tollywood లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నవి ఉన్నాయి. నాల్గవ రోజు నుండి భారీ లాభలను మూటగట్టుకొని వ్యాపారం లో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పరిచాయి. అలా 2020 నుండి విడుదలైన సినిమాలలో 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

1. జాతి రత్నాలు:

Tollywood Movies
Tollywood Movies

నవీన్ పోలిశెట్టి హీరో గా రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘జాతి రత్నాలు’ చిత్రం కరోనా మొదటి వేవ్ పూర్తి అయిన తర్వాత విడుదలైన సినిమాలలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని డబుల్ మార్జిన్ తో దాటింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని 12 కోట్ల రూపాయిలకు కొనుగోలు చెయ్యగా మూడు రోజుల్లోనే 21 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 35 కోట్ల రూపాయిలను వసూలు చేసింది.

2. ఉప్పెన :

Uppena Movie

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మామూలిది కాదు. విడుదలకి ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనలను రేపిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది.కేవలం 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి 3 రోజుల్లోనే 26 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.ఫుల్ రన్ లో దాదాపుగా 55 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.

- Advertisement -

3. Dj టిల్లు :

DJ Tillu

సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించిన ఈ సినిమాకి విడుదలకి ముందే భారీ హైపర్ ఉండేది. కానీ సిద్దు కి మార్కెట్ లేకపోవడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 8 కోట్ల రూపాయిలకు మాత్రమే జరిగింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం తో 3 రోజుల్లోనే దాదాపుగా 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి దాదాపుగా 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే పెట్టిన ప్రతీ రూపాయికి డబుల్ ప్రాఫిట్స్ ని రాబట్టింది అన్నమాట.

4. మేజర్ :

Major MOvie

మహేష్ బాబు నిర్మాణ సంస్థలో అడవి శేష్ హీరో గా నటించిన ఈ చిత్రం అప్పట్లో కరువులో ఉన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి మెడిసిన్ లాగ పని చేసింది. ముంబై టెర్రరిస్ట్స్ అటాక్ లో ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి వీరోచిత పోరాటం చేసిన ఉన్ని కృష్ణన్ జీవిత కథని ఆధారంగా తీసుకొని చేసిన ఈ సినిమాకి 15 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరగగా కేవలం మూడు రోజుల్లోనే 18 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో దాదాపుగా 35 కోట్లు వరకు వసూలు చేసింది. అంటే పెట్టిన ప్రతీ పైసా కి రెండింతల లాభం అన్నమాట.

5. విక్రమ్ :

Vikram Movie

కమల్ హాసన్ హీరో గా నటించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ హీరో నితిన్ కేవలం 6 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసాడు. సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో మూడు రోజుల్లోనే 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమాకి 18 కోట్ల రూపాయిలు వచ్చాయి, అంటే బయ్యర్స్ కి మూడింతలు లాభాలు వచ్చాయి. అలా హీరో నితిన్ ఈ సినిమా ద్వారా జాక్పాట్ కొట్టాడు.

6. కార్తికేయ 2:

karthikeya 2

విడుదలకు ముందు ఈ సినిమా చాలా సవాళ్ళను ఎదురుకుంది. థియేటర్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. కానీ ఈ సినిమా ప్రభంజనం ని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. కేవలం 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి మూడు రోజుల్లో 14 కోట్ల 20 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.ఫుల్ రన్ లో దాదాపుగా హిందీ మరియు తెలుగు బాషలకు కలిపి ఈ సినిమా 60 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

7. భింబిసారా :

Bimbisara Movie

సరైన హిట్టు లేక మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన భింబిసారా చిత్రం విడుదలకు ముందు 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. ఈ సినిమాకి మూడు రోజుల్లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 40 కోట్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సినిమాకి త్వరలో పార్ట్ 2 కూడా రాబోతుంది.

8. సార్ :

Sir Movie

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో చేసిన మొట్టమొదటి చిత్రం ఇది. నిన్ననే విడుదలైన సార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5 కోట్ల 50 లక్షలకు జరిగింది. మొదటి రోజు 2 కోట్ల 75 లక్షలను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజు 3 కోట్ల రూపాయిలను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అలా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డుని నెలకొల్పిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత రాబట్టబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here