Nayanthara : అవార్డ్ ఫంక్షన్​లో లేడీ సూపర్ స్టార్ రచ్చ.. ట్రెండింగ్​లో వీడియో

- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నెట్టింట నయన్​కు ఫాలోవర్స్ మామూలుగా లేరు. సాధారణంగా నయన్ తన ప్రైవేట్ లైఫ్​ను గోప్యంగా ఉంచుతుంది. కానీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ భామ పర్సనల్ లైఫ్ ఫొటోలు, వీడియోలు, విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇక సినిమా ఈవెంట్లలో కూడా నయన్ ఎక్కువగా కనిపించేది కాదు. కానీ బాలీవుడ్​లో జవాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పడి నుంచి అక్కడి ఈవెెంట్లకు తరచూ హాజరవుతోంది. తాజాగా ఈ బ్యూటీ GQ PowerList 2024 అవార్డ్ ఫంక్షన్​లో పాల్గొంది.

ఈ ఈవెంట్​లో నయనతారను మునుపెన్నడూ చూడని అవతారంలో చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బ్లాక్ ఔట్​ఫిట్​లో నయన్ అదిరిపోయింది. టోటల్ హాలీవుడ్ హీరోయిన్ వైబ్స్ ఇచ్చింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కించింది. ఇంతకుముందెన్నడూ నయన్ ఈ రేంజ్ అందాల ప్రదర్శన చేయలేదు. కానీ ఈ ఈవెంట్​లో బాలీవుడ్ హీరోయిన్లు కూడా పాల్గొనడంతో వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా నయన్ హాట్​గా కనిపించిందంటూ నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్లాక్ బోల్డ్ డ్రెస్సులో నయన్ హాట్ లుక్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

- Advertisement -

ఈ ఔట్​ఫిట్​లో లేడీ సూపర్ స్టార్​ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మొదటి అసలు ఇది మా నయనతారేనా అనుకున్న అభిమానులు కాస్త పరిశీలించి చూసి హా మా నయనే అంటూ కామెంట్లు పెట్టారు. ఈ రేంజ్ హాట్​నెస్​ను నయన్ ఎప్పుడూ స్క్రీన్​పైన కూడా చూయించలేదని కుర్రాళ్లు అంటున్నారు. ఏదైమైనా తమ లేడీ సూపర్ స్టార్​ను ఈ న్యూ అవతార్​లో చూడటం భలేగా ఉందంటూ మురిసిపోతున్నారు. సో హాట్.. సో గార్జియస్ అంటూ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో నయన్​పై ప్రేమ వర్షం కురిపించేస్తున్నారు.

ఇక నయనతార సినిమాల సంగతికి వస్తే ఈ భామ గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బీ టౌన్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే నయనతార ఏది పడితే అది చేయకుండా తన లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్​ను కాపాడుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తోందట. అందుకే ఏ ఆఫర్ వచ్చినా అంత ఈజీగా ఓకే చేయడం లేదట. ప్రస్తుతం నయనతార తమిళంలో Test, Mannangatti Since 1960 సినిమాల్లో నటిస్తోంది. ఇక మాలీవుడ్ యాక్టర్‌ నివిన్ పౌలీ చేస్తున్న డియర్ స్టూడెంట్స్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here