Tripti Dimri : బెడ్​రూంలో యానిమల్ బ్యూటీ ఘాటు పోజులు

- Advertisement -

Tripti Dimri : యానిమల్ సినిమాలో జోయాగా అందరిని మెప్పించిన భామ త్రిప్తి దిమ్రి. ఈ సినిమా తర్వాత త్రిప్తికి బాగా పాపులారిటీ వచ్చింది. క్రేజ్ మాత్రమే కాదు సినిమా అవకాశాలు కూడా వరుస కట్టాయి. ఇక సోషల్ మీడియాలో అమాంతం ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈ భామ తన సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం వరుస ఫొటోషూట్లు చేస్తూ ఖుష్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్​తో నెట్టింట రచ్చ లేపింది.

आधीच ऊन्हाच्या झळा, त्यात तृप्तीच्या फोटोंनी तापमानात चांगलीच वाढ - Marathi News | tripti dimri hot and bold photoshoot viral animal actress | Latest filmy News at Lokmat.com

తన లేటెస్ట్ ఫొటోషూట్​లో త్రిప్తి బెడ్​రూమ్ బ్యాక్​గ్రౌండ్​లో ఫొటోలు దిగింది. బెడ్​పై పడుకుని ఘాటు పోజులిస్తూ రచ్చరచ్చ చేసింది. వెల్లకిలా పడుకుని క్లీవేజ్ షో చేస్తూ కవ్వించింది. ఇక తన ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కొంటె నవ్వుతో వాళ్ల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. త్రిప్తి టెంప్టింగ్ పోజులు చూసి కుర్రాళ్లు బేజారయిపోతున్నారు. జోయా.. ఏంటి ఈ మాయ అంటూ కుర్రాళ్లు కవిత్వం రాసేస్తున్నారు ఈ భామపై. ఇంతందం దారి మళ్లిందా.. నేలపైకే జారిందా అంటూ పాటలు పాడేసుకుంటున్నారు.

- Advertisement -

ఇక త్రిప్తి సినిమాల సంగతికి వస్తే ఈ భామకు యానిమల్ చిత్రంతో భారీ క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో ఈ భామ అందం, నటనకు కుర్రాళ్లు తెగ ఫిదా అయ్యారు. నిర్మాతలు కూడా ఈ బ్యూటీ అందానికి మెస్మరైజ్ అయి.. ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. వాటిలో యానిమాల్ పార్క్, బ్యాడ్ న్యూస్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ బులయ్యా-3, ధడక్-2, ఆషికీ-3 సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరో రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here