Kovai Sarala : లేడీ కమెడియన్ కోవై సరళ గుర్తుందా? పాపం ఇప్పుడెలా ఉందంటే ?

- Advertisement -

Kovai Sarala : కోవై సరళ.. ఈ పేరు వింటేనే చాలామంది పెదవులపై చిరునవ్వు పులకిస్తుంది. బ్రహ్మానందంతో ఆమె రూపొందించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది.. తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడ నవ్వులను పంచింది. ఉత్తమ హాస్యనటుడిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. తెలుగులో బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ఇరవై ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించారు.

ప్రస్తుతం కోవై సరళ అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది. బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. తెలుగులో చివరిసారిగా 2015లో కిక్ 2 సినిమాలో కనిపించింది. ఆ తర్వాత నాలుగు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. మళ్ళీ ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కోవై సరళ. తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై కి నాలుగో సీక్వెల్ రాబోతుంది. తమిళ్ లో అరణ్‌మనై 4 గా రాబోతున్న ఈ సినిమా తెలుగులో ‘బాక్’ గా విడుదల కానుంది.

- Advertisement -

కుష్బూ భర్త మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలో.. కుష్బూ నిర్మాణ సారథ్యంలో ఈ అరణ్‌మనై 4 సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, తమన్నా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే 3న తమిళ్, తెలుగు భాషల్లో అరణ్‌మనై 4 సినిమా రిలిజ్ కాబోతుంది. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు. కోవై సరళ చాలా మారిపోయారు. ఏజ్ పెరిగిపోవడంతో ముఖంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. హెయిర్ కట్ తో కళ్లజోడు పెట్టుకొని కనిపించారు. బాక్ ఈవెంట్ నుంచి కోవై సరళ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కోవై సరళ చాలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here