Kamal Haasan : కమల్ హాసన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. రెండు గంటల్లోనే చేశాడుగా

- Advertisement -

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. విలక్షణ పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఇండియన్ 2’ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసిందే. అతను తరచుగా తన నైపుణ్యాలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. దీనికి సంబంధించి మరోసారి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.

kamal hasan

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’తో పాటు ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ తన కలంతో మ్యాజిక్‌ను చాటబోతున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటకు ఆయన సాహిత్యం అందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పాటను కేవలం రెండు గంటల్లోనే రాసి రికార్డ్ చేశారట. అయితే కమల్ హాసన్ సినిమా కోసం పాట రాయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పాటలు రాయడంతో పాటు వాటిని పాడారు కూడా.

- Advertisement -

Kamal Haasan

కమల్ హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ కూడా. ‘థగ్ లైఫ్’ సినిమాలో ఏదో ఒక అద్భుతాన్ని చూస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్ 35 సంవత్సరాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో కలిసి పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై మణిరత్నం, కమల్ హాసన్, శివ అనంతి, ఆర్.మహేంద్రన్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌తో పాటు త్రిష, శింబు కూడా నటించనున్నారు. ఒక విశేషమేమిటంటే ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను అందించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here