Ram Charan : రామ్ చరణ్ పై కుట్ర.. రాజమౌళి కి బుద్ది చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఏ రేంజ్ గుర్తింపు తెచ్చుకుందో మన అందరం చూస్తూనే ఉన్నాం.ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో కూడా చోటు దక్కించుకుంది.ఈ సినిమాకి ఆ రేంజ్ గుర్తింపు రావడానికి రాజమౌళి పాత్ర ఎంత అయితే ఉందో,ఇందులో హీరోలుగా చేసిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పాత్ర కూడా అంతే ఉంది.అయితే సినిమా విడుదలైన కొత్తల్లో ఎన్టీఆర్ అభిమానులు మా హీరో పాత్ర బాగా తగ్గింది అంటూ ఫీలైన సంగతి అందరికీ తెలిసిందే.రాజమౌళి ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ బండ బూతులు తిట్టేవారు.ఒకానొక దశలో సోషల్ మీడియా లో ఏదైనా ట్వీట్ వేయాలన్న రాజమౌళి భయపడే పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే క్రింద కామెంట్స్ లో రాజమౌళి ని ఇష్టమొచ్చినట్టు తిట్టేవాళ్ళు ఫ్యాన్స్.ఎన్టీఆర్ పాత్ర విషయం లో ఫ్యాన్స్ ఆగ్రహం ని అర్థం చేసుకున్న రాజమౌళి మరియు అతని కొడుకు కార్తికేయ సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు.

Ram Charan

ఓటీటీ లో విడుదలయ్యాక #RRR మూవీ కి అంతర్జాతీయ రేంజ్ లో గుర్తింపు లభించింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేశాన్ని చల్లబర్చేందుకు రాజమౌళి కొడుకు కార్తికేయ అమెరికా లోని పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ తో ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు రాబోతుంది అంటూ జోరుగా ప్రచారం అయ్యేలా చేసారు.ఇక తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందంటూ ఊదరగొట్టేసారు.దీనితో సామాన్యులకు కూడా క్షేత్ర స్థాయిలో ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుంది అని నమ్మేశారు.ఆ రేంజ్ లో ప్రచారం చేసి చివర్లో ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవడం తో ‘అడుగు దూరం లో ఆస్కార్ మిస్’ అని మరో ప్రచారం చేసారు.అలా సినిమాలో మెయిన్ హీరో గా చేసిన రామ్ చరణ్ ని పట్టించుకోకుండా ఎన్టీఆర్ కోసం ఒక రేంజ్ లో క్యాంపైన్ చేసింది కార్తికేయ & టీం.

అయితే ఎంత దాచాలని చూసిన నిజమైన ప్రతిభ ని దాచలేం.రామ్ చరణ్ విషయం లోను అదే జరిగింది.మూవీ టీం మొత్తం ఎన్టీఆర్ ని బాగా హైలైట్ చెయ్యాలని చూసిన చివరికి రామ్ చరణ్ హైలైట్ అయ్యాడు.టైటానిక్ మరియు అవతార్ సిరీస్ వంటి వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ #RRR సినిమాలోని రామ్ చరణ్ పాత్రపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అంతే కాదు మరో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ కూడా ప్రత్యేకించి రామ్ చరణ్ పాత్ర గురించే మాట్లాడాడు.ఈ వీడియోలు వైరల్ అయినా కూడా #RRR మూవీ టీం పట్టించుకోకపోవడం పై మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.ముఖ్యంగా చిరంజీవి కూడా ఈ విషయం పై అసంతృప్తితో ఉన్నట్టు నిన్న ఆయన వేసిన ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది.

- Advertisement -

చిరంజీవి మాట్లాడుతూ ‘జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ పాత్రని గుర్తించి ప్రశంసలు కురిపించడం , రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డు కంటే గొప్ప విషయం.ఒక తండ్రిగా ఈరోజు #RRR సినిమాలో రామ్ చరణ్ కి దక్కిన గుర్తింపుని చూసి ఎంతో గర్వపడుతున్నాను’అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో నందమూరి అభిమానులకు మండిపొయ్యేలా చేస్తున్నాయి.రామ్ చరణ్ ని ఉద్దేశపూర్వకంగానే తొక్కే ప్రయత్నం చేసిన రాజమౌళి ని ఆ ట్వీట్ లో ట్యాగ్ చెయ్యకుండా వెయ్యడం ని చూస్తూ ఉంటే #RRR టీం రామ్ చరణ్ పట్ల చేసిన కుట్రలపై చిరంజీవి ఎంతలా హర్ట్ అయ్యాడో అర్థం అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here