Guess Who : నయనతార సిస్టర్ ను చూశారా.. అచ్చం అక్కలాగే డిట్టో

- Advertisement -

Guess Who : మనిషిని పోలిన మనుషులు ఈ భూమ్మీద ఏడుగురు ఉంటారని చెబుతుంటారు.. ఈ విషయాన్ని చాలా మంది నమ్మరు కానీ కొన్ని సార్లు అలాంటివి చూస్తే కచ్చితంగా నమ్మాలని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో మారుమూల ఉన్న అలాంటి వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. సాధారణంగా మనం ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల జిరాక్స్ కాఫీ లా ఉన్న వారిని చూశాం. అచ్చం దివంగత హీరోయిన్ సౌందర్యలా ఉన్న చిత్ర అనే అమ్మాయి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా జూనియర్ సమంత, నటి సిల్క్ స్మిత ఇలా చాలా మంది పోలికలతో ఉన్న వారు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయారు.

ఈ క్రమంలోనే సౌతిండియా లేడి డాన్ నయనతారను ప్రింట్ తీసినట్లుగా ఉండే ఓ అమ్మాయి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అచ్చుగుద్దినట్లు నయన్ పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాలకు, అద్భుతమైన నటనకు నయన్ పెట్టింది పేరు. అయితే తాజాగా అచ్చం ఈ బ్యూటీలా ఉన్న ఓ అమ్మాయి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వాస్తవానికి ఆ ముద్దుగుమ్మ పేరు సజినీ కృష్ణ. ఈమె కొద్ది రోజుల క్రితం ఒడిపోలమా సినిమాలోని ఓ పాటకు లిప్ సింగ్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అందులో స్మోకీ మేకప్ లుక్ తో సాంప్రదాయ దుస్తులను ధరించి, డైలాగ్‌కు తగినట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఆకర్షించింది. ఇక ఇది చూసిన వారు అచ్చం నయన్ లానే ఉంది. నయన్‌కు జీరాక్స్ కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం నయన్ తార వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. హీరోయిన్ గా 75 కంటే ఎక్కువ సినిమాలలో నటించింది నయనతార. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటున్నారు.39 సంవత్సరాల వయస్సులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటూ నయన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here