Payal Radhakrishna : డబ్బులిస్తేనే ఆ పనికి ఓకే అంటున్న హీరోయిన్.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు

- Advertisement -

Payal Radhakrishna : హీరో సుహాస్ వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌‘ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ప్రసన్న వదనం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు అర్జున్ ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో హీరోకు ఉన్న జబ్బుతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఓ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. ఈ సినిమా మే 3న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ నిర్మాతలకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుంది. మొదట మోడలింగ్ చేసి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపే దక్కించుకుంది. పాయల్ కన్నడలోనే కాకుండా తమిళంలోనూ నటించింది. ఇక ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

- Advertisement -

ఇందులో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాధాకృష్ణ నిర్మాతలకు కొన్ని సీన్స్ చేయాలంటే ఆమె కండీషన్ పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పెంపుడు జంతువులు అంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి జంతువులతో సీన్స్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా నటించాలంటే మాత్రం తప్పనిసరిగా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందట. లేదంటే నటించనని మొఖం మీదే చెప్పేస్తుందట. సినిమా కోసం నిర్మాతలు కూడా ఈ అమ్మడు ఎంత అడిగితే అంత అడిగినంత ఇస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇదేం వింత కండీషన్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here