నిజం అని రాస్తే సరిపోదు అంటూ.. కేరళ స్టోరీ మూవీపై సెటైర్స్ వేసిన కమల్ హాసన్

- Advertisement -

ఇటీవల కాలంలో వివాదాల కారణంగా మంచి పబ్లిసిటీ పొందిన సినిమాల్లో “ది కేరళ స్టోరీ” కూడా ఒకటి. సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు గట్టిగా వచ్చాయి. పలు రాష్ట్రాలలో ఈ సినిమాపై నిషేదం కూడా విధించారు. అయితే నెగటివ్ పబ్లిసిటీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. దాంతో ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 200 కోట్లు కొల్లగొట్టింది.

కేరళ స్టోరీ
కేరళ స్టోరీ

అయితే తాజాగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై నటుడు కమల్ హాసన్ సెటైర్లు వేశారు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేవలం ప్రచారం కోసం తీసే సినిమాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. “నేను మీకు ఇప్పటికే చెప్పాను. నేను ప్రచారం కోసం తీసే చిత్రాలకు వ్యతిరేకం. సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు. కానీ, నిజం అనే రాస్తే సరిపోదు. నిజంగా నిజం ఉండాలి. ఈ సినిమాలో చూపించే నిజం నిజం కాదు” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

కాగా ఇక మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టడం పట్ల నటి ఆదా శర్మ హర్షం వ్యక్తం చేసింది. ఏఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టింది. అందులో.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో విడుదల కాకాపోయినా, దేశంలో రూ. 200 కోట్ల నికర వసూళ్లను సాధించిన మొదటి మహిళా చిత్రంగా నిలిచింది. జీవితంలో అత్యుత్తమ విషయాలు ఊహించనివి. అంచనాలకు మించి ఈ సినిమా రాణిస్తోంది. ఈ సినిమా ఈ రేంజిలో విజయం అందుకోవడం పట్ల సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. మరి కమల్ వ్యాఖ్యలపై ఆదా శర్మ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here