ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత ఈ పోస్ట్ అర్థమదేనా..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రాంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‏లోనూ సామ్ నటిస్తున్నారు.

హాలీవుడ్ డైరెక్టర్ జాన్ ఫిలిం దర్శకత్వం వహిస్తున్న చెన్నై స్టోరీ (Chennai Story) అనే సినిమాలో నటుడు వివేక్ కల్రా సరసన సమంత హీరోయిన్గా నటిస్తుందట. ఇక ఈ సినిమా ప్రేమ కథ చిత్రం అని,ఇందులో వివేక్ కల్రా (Vivek Kalra) తో కలిసి సమంత ప్రేమలో మునిగి తేలబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha
Samantha

సోషల్ మీడియాలో సామ్ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కేవలం సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో మోటివేషన్ కోట్ షేర్ చేసారు. “కష్టమైన విషయాలు మంచి విషయాలకు దారితీస్తాయి. కాలాలు మీ బలాన్ని పరీక్షిస్తాయి.. పరిస్థితులు మీకు అసౌకర్యంగా ఉంటాయి.. అలాంటి పరిస్థితులపట్ల మీరు చూపే ధైర్యం.. అందుకు అవసరమైన నిర్ణయాలు మిమ్మల్ని నిజమైన నెరవేర్పు వైపు నడిపించేవి.

- Advertisement -

మీరు అగ్ని గుండా నడవడానికి, అనిశ్చితికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే.. మీరు చివరికి మీ కోసం ఎదురుచూసే అందం ప్రపంచాన్ని చూస్తారు. కాబట్టి కష్టాల నుంచి పారిపోవడం మానేయండి. ఎందుకంటే కష్టమైన విషయాలు మంచి విషయాలు పెరగడానికి పునాది వేస్తాయి” అనే మోటివేషనల్ కోట్ షేర్ చేశారు సమంత .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here