50 రోజుల్లో ‘Waltair Veerayya ‘ సృష్టించిన అద్భుతాలు ఇవే..ఏ హీరోకి సాధ్యపడని అరుదైన రికార్డ్స్

- Advertisement -

Waltair Veerayya మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని,నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని అరుదైన రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.కొన్ని ప్రాంతాలలో అయితే #RRR చిత్ర రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేసింది.ఒక సాధారణమైన కమర్షియల్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం ఒక్క మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే సాధ్యం.

Waltair Veerayya
Waltair Veerayya

ఓటీటీ కి బాగా అలవాటుపడిన జనాలు ఉన్న ఈరోజుల్లో ఒక సినిమాకి 3 వారాల థియేట్రికల్ రన్ రావడమే చాలా కష్టం, అలాంటిది మెగాస్టార్ తన మాస్ తో ‘వాల్తేరు వీరయ్య’ Waltair Veerayya చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 67 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకునేంత రన్ ని ఇచ్చాడు.నేడు ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యం లో ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాము.

chiru

మొదటి వారం లోనే వంద కోట్ల షేర్ :

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకం, నేటి తరం స్టార్ హీరోలు కూడా కొంతమంది ఈ క్లబ్ లోకి అడుగుపెట్టలేదు.కానీ చిరంజీవి కేవలం మొదటి వారం లోనే 104 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి చరిత్ర సృష్టించాడు.రాజమౌళి, అల్లు అర్జున్ మినహా ఇప్పటి వరకు ఈ అరుదైన రికార్డుని ఎవ్వరు నెలకొల్పలేకపొయ్యారు.

chiranjeevi

ఉత్తరాంధ్ర – ఈస్ట్ గోదావరి లో ప్రభంజనం:

ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమా మొదటి రోజు నుండి అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోయింది.ఈ ప్రాంతం లో ఈ సినిమా 50 రోజులకు గాను 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటి వరకు ఈ ప్రాంతం లో బాహుబలి సిరీస్ ,#RRR మరియు అలా వైకుంఠపురం లో సినిమాలు మినహా ఏ సినిమాకూడా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు. మరో విశేషం ఏమిటంటే అలా వైకుంఠపురం లో చిత్రం కంటే ‘వాల్తేరు వీరయ్య’ కి చాలా తక్కువ టికెట్ రేట్స్ పెట్టారు. అయినా కూడా 20 కోట్ల రూపాయిల షేర్ ని సాధించడం మామూలు విషయం కాదు.

గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన #RRR చిత్రం ఈస్ట్ గోదావరి జిల్లాలో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 50 రోజులకు గాను 13.5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ ప్రాంతం లో కాకినాడ , రాజముండ్రి వంటి సిటీస్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.

రాయలసీమ లో అన్ బీటబుల్ రికార్డ్స్:

మెగాస్టార్ చిరంజీవి కి రాయలసీమ ప్రాంతం లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయన హిట్ సినిమాలు ఇక్కడ అద్భుతాలు సృష్టిస్తాయి.9 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ లోకి ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో రీ ఎంట్రీ ఇచ్చి ఈ ప్రాంతం లో 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాడు. ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి చిత్రం తో 19 కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్నాడు, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరోసారి 19 కోట్ల రూపాయిల షేర్ ని అందుకొని, అత్యధిక 15 కోట్ల రూపాయలకు పైగా షేర్స్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో గా చరిత్ర సృష్టించాడు.

నైజాం లో రికార్డ్స్ ఊచకోత :

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నైజాం లో బెస్ట్ రన్ ఉన్న సినిమాగా ‘వాల్తేరు వీరయ్య’ నిలిచిందని చెప్పొచ్చు.ఈ ప్రాంతం నుండి సుమారుగా 16 డైరెక్టు కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా మొదటిరోజు ఈ సినిమాకి కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే ఈ ప్రాంతం నుండి వచ్చాయి.కానీ ఫుల్ రన్ లో ఏకంగా 36 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టింది.12 కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో మొదలైన సినిమాలే క్లోసింగ్ లో 35 కోట్ల రూపాయిలను రాబట్టడానికి కష్టపడ్డాయి. అలాంటిది 6 కోట్ల రూపాయిల నుండి 36 కోట్ల రూపాయిల వరుసకు రాబట్టింది అంటే, ఈ ప్రాంతం లో ఈ సినిమాకి ఎలాంటి రన్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు లో నాన్ రాజమౌళి రికార్డు:

మెగాస్టార్ చిరంజీవి కి నెల్లూరు ప్రాంతం మొదటి నుండి కంచుకోట గా ఉంటూ వస్తుంది.ఆయన డిజాస్టర్ సినిమాలు సైతం ఇక్కడ రికార్డ్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి.అలాంటిది ఒక కమర్షియల్ హిట్ పడితే అక్కడ రికార్డ్స్ రాకుండా ఎలా ఉంటాయి. నిన్నమొన్నటి వరకు నాన్ రాజమౌళి రికార్డు గా ఉన్న ‘అలా వైకుంఠపురం లో’ రికార్డు ని అవలీల గా దాటి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలకు పైగా షేర్ ని వసూలు ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు గా నిలిచింది.

అలా అన్నీ ప్రాంతాలలో ఈ సినిమా రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంది.ఈ 50 రోజులకు గాను ఈ చిత్రం 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here