Adah Sharma : తెల్లవార్లు బారులోనే గడిపేస్తోన్న హీరోయిన్ ఆదాశర్మ.. రాత్రంతా అదే పనంట

- Advertisement -

Adah Sharma : టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నదానికి అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. కానీ, ఇటీవల వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకుంది. రూ.300 కోట్ల వ‌ర‌కూ క‌లెక్ట్‌ చేసిన ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. నటనలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాకుండా.. అదే తరహాలో వచ్చిన ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’ మూవీతో కూడా మంచి హిట్ అందుకుంది.

త‌ర్వాత స‌న్‌ఫ్ల‌వ‌ర్ అనే వెబ్ సిరీస్‌లోనూ మంచి పాత్రను పోషించింది. ఆమె ఎంచుకుంటోన్న పాత్రలపై ప్రేక్ష‌కులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా స‌న్‌ఫ్ల‌వ‌ర్ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది ఆదా శర్మ. స‌న్‌ఫ్ల‌వ‌ర్ వెబ్‌సిరీస్‌లో ఓ బార్ డ్యాన్స‌ర్ క్యారెక్ట‌ర్‌లో నటించింది. ఆ క్యారెక్ట‌ర్ నేచుర‌ల్‌గా ఉండేందుకు తాను ప‌డ్డ క‌ష్టాన్ని చెప్పుకొచ్చింది. బార్ డ్యాన్స‌ర్‌గా తన పాత్రలో సహజంగా కనిపించేందుకు డ్యాన్స్ బార్‌లో ప్ర‌తి క్ష‌ణాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిందట. అందుకోసం డ్యాన్స్ బార్‌లో గంట‌ల‌కొద్ది టైం స్పెండ్ చేసిందట. సిరీస్‌ చూసే ప్రేక్ష‌కుల‌ కళ్లకు వాస్తవంగా అనిపించాలని, పర్ఫామెన్స్ స‌రిగా చేయకపోతే ఎంత చేసినా ఆ న‌ట‌న‌లో సహజత్వం కనిపించదని భావించింది. అందుకోసమే తాను అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని అర్థం చేసుకునేందుకు బార్​లోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింద‌ంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

రోజూ రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4 నుంచి 5గంటల వరకూ బార్‌లోనే ఉండేదట. ఆ స‌మ‌యంలో బార్‌కు వ‌చ్చే కస్టమర్లతో మాట్లాడం, అక్క‌డి వారి న‌డ‌వ‌డిక‌ను అబ్జర్వ్ చేయడం ద్వారా త‌న‌కు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. అదా శర్మ స్కూల్ పూర్తి కాగానే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాక్సాఫిసు వ‌ద్ద సూప‌ర్ హిట్ అయిన‌.. విక్రమ్​భట్ తెరకెక్కించిన ‘1920’ సినిమాలో నటించినప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలేనట. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ బాష‌లలో ప‌లు చిత్రాల్లో ముద్దుగమ్మ నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here