Akhil Akkineni : అఖిల్ తలరాత మార్చబోతున్న జాన్వీ కపూర్.. ఈ దెబ్బతో అయ్యగారే నం.1

- Advertisement -

Akhil : అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు కానీ కెరీర్ కు ఉపయోగపడే విధంగా సక్సెస్ అందుకున్న సినిమా అయితే రాలేదు. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత అఖిల్ పెద్దగా బయట కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా వృథా అయిపోయిందని డైరెక్టర్ ను ఫ్యాన్స్ తిట్టిపోశారు.

akhil akkineni

ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ లో అఖిల్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి అఖిల్ ఫారిన్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 8న తన పుట్టిన రోజు వేడుకలను ఫారెన్‌లో సెలబ్రేట్ చేసుకుని తాజాగా హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ తన తదుపరి సినిమా కోసమే అంటూ భావిస్తున్నారు అఖిల్ అభిమానులు. సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న అఖిల్ సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ తో సినిమా ఛాన్స్ ని పట్టేశాడట. అంతేకాదు ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందట. కెరీర్లో ఒక్క హిట్ లేని అఖిల్ సినిమాను జాన్వీ ఓకే చేయడం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉంది .

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్ద క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం దేవర సినిమాలో ఆఫర్ పట్టేగానే ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. అదేవిధంగా రామ్ చరణ్ నటించనున్న కొత్త సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. అయితే ఇలాంటి మూమెంట్లో ఆమె అఖిల్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందన్న విషయం తెలియడంతో జనాలు అవాక్కవుతున్నారు. అఖిల్ తలరాతను మార్చే హీరోయిన్ జాన్వీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here