Jr NTR : ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్టీఆర్… నీలో ఇంత కోపం ఎన్నడూ చూడలేదన్నా

- Advertisement -

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ దేవర మీదే తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా దాన్ని చిత్ర బృందం అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ వార్ 2 సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాని వార్ సినిమా డైరెక్టర్ చేసిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో దేవర షూటింగ్ ని, ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ ని చేస్తూ వస్తున్నారు. ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం సెకండ్ షెడ్యూల్ కోసం మళ్లి ముంబై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక అక్కడే ముంబైలో ఉన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అవుతూ కనిపించారు.

- Advertisement -

ఫోన్ మాట్లాడుతూ హోటల్ లోకి వెళ్తున్న ఎన్టీఆర్ ని ఫోటో తీసేందుకు కొందరు ఫోటోగ్రాఫర్స్ వెనకపడ్డారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తుండడంతో ఎన్టీఆర్ కోప్పడ్డారు. ఓయ్ అంటూ వారి పై ఫైర్ అవుతూ అరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ ఇలా చేయడానికి కారణం.. మూవీలోని తన మాక్ ఓవర్ అండ్ లుక్ ని సీక్రెట్ గా ఉంచడం కోసమే అని తెలుస్తోంది. మూవీలోని తన మాక్ ఓవర్ ని రివీల్ చేయకూడదని ఎన్టీఆర్ చూస్తుంటే.. అక్కడి ఫోటోగ్రాఫర్స్ తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తూ వస్తున్నారు. దీనివల్లే ఎన్టీఆర్ సీరియస్ అవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here