Vidya Balan : మెగాస్టార్ లా ఖాన్స్ ఆ పాత్ర చేయలేరు.. బాలీవుడ్ స్టార్లను ఎంత మాటంది సార్

- Advertisement -

Vidya Balan బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి తెలియని వారుండరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఈ భామ తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంది. ఈ బ్యూటీ ఏడాదికి నాలుగు సినిమాలు ఎడాపెడా చేయదు. కానీ విద్యా బాలన్ సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. చాలా రోజుల తర్వాత విద్యా తాజాగా ఓ సినిమాలో నటించింది. దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంలో నటించిన విద్యా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా అన్‌ఫిల్టర్డ్ అనే పాడ్‌కాస్ట్​లో పాల్గొన్న ఈ భామ బాలీవుడ్ ఖాన్ ల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

​మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి మెగాస్టార్ అన్న సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ స్టార్ హీరో ఇప్పటి యంగ్ హీరోలకు దీటుగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. తన 40 ఏళ్ల కెరీర్ లో మమ్ముట్టి చాలా డిఫరెంట్ రోల్స చేశారు. చాలా రకాల జానర్స్ లో నటించారు. గతేడాది ఈ మెగాస్టార్ కాథల్ : ది కోర్ అనే చిత్రంలో ఏకంగా గే పాత్ర పోషించారు.

- Advertisement -

తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ బేస్ ను మనసులో పెట్టుకోకుండా.. ఆ పాత్ర చేస్తే తన ఇమేజ్ ఏమవుతుందోనని ఆలోచించకుండా.. తన కళే తనకు ముఖ్యమని భావించారు మమ్ముట్టి. ఒక నటుడిగా తాను అన్ని పాత్రలను చేయగలననే భరోసాతో ఆ పాత్రకు ఓకే చెప్పారు. ఆ సినిమా ఎంతటి హిట్ అయిందో.. మమ్ముట్టి గే పాత్ర చేసిన ప్రేక్షకులు ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై, ఇందులో మమ్ముట్టి పాత్రపై బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ మాట్లాడింది. ఇలాంటి పాత్రలు, సినిమాలు బాలీవుడ్ లో ఎవరూ చేయరని చెప్పుకొచ్చింది. అంతెందుకు  హిందీ హీరోల్లో ఖాన్స్ (షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్) కూడా ఈ పాత్ర పోషించలేరని బల్లగుద్ది చెప్పింది విద్య. సౌత్ ప్రేక్షకులు ఇలాంటి వాటిని ఆదరించిన తీరును కూడా ప్రశంసించింది.

“కేరళలో ఎక్కువగా అక్షరాస్య ప్రేక్షకులు ఉంటారన్న విషయాన్ని మనం అంగీకరించాలి. అదే పెద్ద తేడా. మమ్ముట్టి గే పాత్ర పోషించడాన్ని నేను తక్కువ చేయడం లేదు. కానీ అక్కడ అలాంటి పాత్ర పోషిచండ కాస్త సులువు. అక్కడి వాళ్లు అంగీకరిస్తారు. ఇలాంటి విషయాల్లో వాళ్లు చాలా ఓపెన్​గా ఉంటారు. సౌత్​లో తమ నటులను వాళ్లు చాలా గౌరవిస్తారు. పూజిస్తారు. ముఖ్యంగా మేల్ సూపర్ స్టార్లను. అందుకే అయన ఆ పాత్రను పోషించి ఉంటారు.

నేను కాథల్: ది కోర్ సినిమా చూశాక శుభాకాంక్షలు చెప్పాలని దుల్కర్ సల్మాన్​కు మెసేజ్ కూడా పెట్టాను. మలయాళ బిగ్గెస్ట్ సూపర్​ స్టార్ అలాంటి సినిమాలో నటించడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేశారంటే అక్కడి వాళ్ల మద్దతు అలాంటింది. దురదృష్టం ఏంటంటే మన హిందీ స్టార్లలో ఎవరూ అలాంటి పాత్ర పోషించలేరు. అయితే ఇప్పుడున్న జనరేషన్​ దీనిని బ్రేక్ చేసి అలాంటి పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానా శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంలో గే పాత్ర పోషించాడు.” అని విద్యాబాలన్​ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here