Allu Arjun : క్రేజీ డైరెక్టర్ తో ఐకాన్ స్టార్ కొత్త సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..

- Advertisement -

ఐకాన్ స్టార్ Allu Arjun పుష్ప సినిమా తో సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.. ఇప్పుడు పుష్ప 2 మరో బ్లాక్ బస్టర్ ను అందించడానికి రెడీ అవుతున్నాడు..అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సడెన్ గా తన 23వ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో సినిమా చేయబోతున్న పాన్ ఇండియా దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే ఎప్పుడు విడుదలవుతుంది? నిర్మాత ఎవరు అనే విషయాలను వెతుకుతున్నారు..

Allu Arjun
Allu Arjun

ఈ మధ్య తెలుగు స్టార్ హీరోలు అందరు వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.పుష్ప సినిమాతో ఘనవిజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ కూడా 1000 కోట్ల మార్కెట్ అందుకుంటుంది అని టాలీవుడ్ లో అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక అల్లు అర్జున్ కూడా ఆ రికార్డులను బ్రేక్ చేసేలా కొత్త సినిమాను లైనప్ చేసుకున్నాడు.పుష్ప 2 ఎంత త్వరగా వీలైతే అంతగా సినిమాను ఫినిష్ చేసి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..మరోవైపు అల్లు అర్జున్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఇక చాలాకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న దర్శకుల చేత అల్లు అర్జున్ కథలు వింటూనే ఉన్నాడు..

Sandeep Reddy Vanga Allu Arjun

ఇది ఇలా ఉండగా.. గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్ తన 23వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అనేకరకాల వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆ విషయంలో ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ టి సిరీస్ లో భూషణ్ కుమార్ నిర్మాతగా అల్లు అర్జున్ 23వ సినిమా తెరకేక్కుతున్నట్లు అనౌన్స్ చేశారు. టాలివుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో అటు బాలీవుడ్ లోనూ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు.. అలాగే పాన్ స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు..ఈ సినిమాను 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రభాస్ ఒకవేళ బిజీగా ఉంటే అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చునని టాక్.. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here