వచ్చింది 30 కోట్లు..కానీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు..కన్నడ ఇండస్ట్రీ పరువు తీస్తున్న Kabzaa

- Advertisement -

Kabzaa : సాధారణంగా భారీ సినిమాలకు ప్రొమోషన్స్ కోసం కలెక్షన్స్ తో కూడిన పోస్టర్స్ ని విడుదల చెయ్యడం ఆనవాయితీగా వస్తూనే ఉంది.వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు చూపించి పబ్లిసిటీ చెయ్యడం.’ఇంత వసూళ్లు వచ్చాయా’ అని ప్రేక్షకులు నమ్మి థియేటర్స్ కి కదలడం వంటివి గతం లో మనం చాలానే చూసాము.అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలు నమ్మేవారు.

Kabzaa :
Kabzaa :

కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది.ఏ సినిమాకి ఎంత వసూళ్లు వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది.ఒకవేళ రాని వసూళ్లను వచ్చినట్టు చూపిస్తే సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భయంకరమైన ట్రోల్ల్స్ కి గురవ్వక తప్పదు.రీసెంట్ గా విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ కన్నడ చిత్రం ‘కబ్జా‘ ఇప్పుడు అలాంటి ట్రోల్స్ కి గురి అవుతుంది.ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.

upendra

120 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.పెట్టిన బడ్జెట్ కి వచ్చిన ఓపెనింగ్ చిల్లరే అని చెప్పొచ్చు.రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా ఇదే పరిస్థితి.మొత్తం మీద మూడు రోజులకు గాని అన్నీ భాషలకు కలిపి కేవలం 30 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది.కానీ నిర్మాతలు చూపిస్తున్న నంబర్స్ మాత్రం కర్ణాటక సినిమా ఇండస్ట్రీ పరువుని తీసే విధంగా ఉంది.

- Advertisement -
sucsess

ఎందుకంటే పట్టుమని మూడు రోజుల్లో అతి కష్టం మీద 30 కోట్లు రప్పించుకున్న సినిమాకి రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చకి దారి తీసింది.ఇలా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటే నవ్వులపాలు అవ్వడం తప్పిస్తే మరొక ఉపయోగం లేదు.కంటెంట్ మీద ద్రుష్టి పెట్టి మంచి సినిమాలను తియ్యండి, ఈ కలెక్షన్స్ నిజంగానే వస్తాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here