Kabzaa120 కోట్లు పెట్టి తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇంతేనా..ట్రేడ్ ని షాక్ కి గురి చేసిన ‘కబ్జా’ మొదటి రోజు వసూళ్లు

- Advertisement -

Kabzaa పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమా బాగా ఆడిందని ప్రతీ చిత్రం ఆడాలని రూల్ ఏమి లేదు,ప్రేక్షకులు అన్ని చిత్రాలకు అద్భుతమైన వసూళ్లు ఇస్తారని కూడా గ్యారంటీ లేదు.ఎన్ని కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి ఒక సినిమాని నిర్మించినా వాళ్లకి అది అనవసరం.కంటెంట్ వాళ్ళని అలరించిందా లేదా అనేదే కావాలి.ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవాలి, అప్పుడే జనాలు థియేటర్స్ కి కదులుతారు, లేకపోతే ఓటీటీ ఎలాగో ఉంది, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని రిలాక్స్ అయిపోతారు.

Kabzaa
Kabzaa

రీసెంట్ గా విడుదలైన ‘కబ్జా’ పరిస్థితి కూడా అలాగే అయ్యింది.పాన్ ఇండియా స్కేల్ తో భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ చిత్రం KGF సిరీస్ మరియు కాంతారా లాగ ప్రభంజనం సృష్టిస్తుంది అని అనుకున్నారు.ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా , భారీ గా తీశారు కాబట్టి మినిమం గ్యారంటీ గా అయినా ఉంటుందేమో అని అనుకున్నారు అభిమానులు ప్రేక్షకులు.కానీ మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

shriya

ఫలితంగా ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రం గానే వచ్చాయి.తెలుగు లో ఉపేంద్ర కి మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది కాబట్టి, టాక్ లేకపోయినా కూడా కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.ఇక కర్ణాటక లో ఈ చిత్రం సుమారుగా 8 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.హిందీ తమిళం బాషలలో కూడా అంతంత మాత్రం గానే వసూళ్లు వచ్చాయి.మొత్తం మీద మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 13 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది.

- Advertisement -
upendra

ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.అంత స్కేల్ తో తెరకెక్కించిన సినిమా కాబట్టి మొదటి కనీసం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని అయినా రాబట్టాలి.కానీ అంచనాలను ఏమాత్రం కూడా అందుకోలేకపోయింది.ఇదే ట్రెండ్ కొనసాగితే క్లోసింగ్ కలెక్షన్స్ 50 కోట్ల రూపాయిల లోపే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.అదే కనుక జరిగితే ఉపేంద్ర కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here