Mahesh Rajamouli సినిమాలో హాలివుడ్ బ్యూటీ.. జక్కన్న బడ్జెట్ ఎంతో తెలుసా?

- Advertisement -

Mahesh Rajamouli వరల్డ్ ఫెమస్ తెలుగు డైరెక్టర్ రాజమౌళి గురించి అందరికి తెలుసు..ఆయన చేసే సినిమాల పై ఎక్స్పేక్టేషన్స్ కూడా ఓ రేంజులో ఉంటాయి.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో SSMB 29 సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గత ఏడాది RRR విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న మ‌హేష్ కోసం క‌థ‌ను త‌యారు చేస్తూనే మ‌రో వైపు ఆస్కార్ వేడుక‌ల‌కు ఆర్ఆర్ఆర్‌ను పంపించి అవార్డుని సాధించారు. ఆస్కార్ విన్నింగ్ త‌ర్వాత తెలుగు సినిమా రేంజ్ ప్ర‌పంచానికి మ‌రోసారి తెలిసింది. దీంతో ఇప్పుడు రాజ‌మౌళి నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే రాజ‌మౌళి సినిమాను రూపొందించేలా అడుగులు వేస్తున్నారు. మహేష్ సినిమాకు కథ మరియు ఎంత బడ్జెట్ పెడుతున్నారు అనేది ఆసక్తిగా మారింది..

Mahesh Rajamouli
Mahesh Rajamouli

మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో హాలివుడ్ యాక్టర్స్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కథ కూడా అడవెంచర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.అందులో భాగంగా ఈ సంస్థ ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయించే ప‌నిలో ఉంది. ఇది వ‌ర‌కే ఈ సినిమాలో థోర్ మూవీ యాక్ట‌ర్ క్రిస్ హెమ్స్ వ‌ర్త్ ఈ సినిమాలో న‌టిస్తార‌నే టాక్ ఉంది. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ న‌టిస్తార‌నే వార్త‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఆ హీరోయిన్ ఎవ‌రై ఉంటారా అనే ప్రశ్నలు రావడం సహజం.. అయితే తాజాగా హీరోయిన్ గా..జెన్నా ఒర్టెగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒక‌రు దీపికా ప‌దుకొనె కాగా.. మ‌రో హీరోయిన్‌గా జెన్నా ఒర్టెగా క‌నిపించ‌నుంద‌ని టాక్‌. ఫారెస్ట్ అడ్వెంచ‌ర‌స్ మూవీగా SSMB 29ను రూపొందించ‌నున్నారు. పాన్ వ‌ర‌ల్డ్ చిత్రంగా సినిమాను రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత రాజ‌మౌళితో సినిమాను స్టార్ట్ చేస్తారు. ఈ ఏడాదిలోనేపూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని టాక్..అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది..ఈ సినిమాకి ఏకంగా మేకర్స్ 800 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. కాగా ఇది కేవలం అంచనా బడ్జెట్ మాత్రమే కాగా ఇది మరింత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు..అయితే ఇప్పుడు ఈ సినిమా ఊహించని లెవెల్లో కాస్ట్లీయెస్ట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది అని చెప్పాలి.. మరి జక్కన్న ఈ సినిమాతో ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here