Bhavana : ఏడేళ్లలో నాలుగు అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. విసిగిపోయానంటూ ఆవేదన

- Advertisement -

Bhavana : సోషల్ మీడియాలో హీరోయిన్స్ గురించి నిత్యం ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్లు తమ గురించి వచ్చే రూమర్లపై గట్టిగానే రియాక్ట్ అవుతుంటారు. ఇక మరికొందరు మాత్రం అంతగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటారు. తాజాగా మలయాళ భామ భావన… తన గురించి కొన్నాళ్ల క్రితం వినిపించిన రూమర్స్ పై స్పందించారు. భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో, మహాత్మ వంటి సినిమాల్లో నటించింది.. అయితే ఆ తర్వాత కారణాలేంటో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.

మలయాళంల్లో వరస ఆఫర్లు వస్తున్నాయి, కెరియర్ పర్లేదు అనుకుంటున్న సాఫీగా సమయంలో భార్యాభర్తల వివాదంలో చిక్కుకుని.. భావన కిడ్నాప్‎కు గురై సంచలనం అయింది. మలయాళ నటుడు దిలీప్ భార్య మంజు దూరం అవడానికి భావనే కారణమని భావించి డబ్బులు ఇచ్చి మరీ ఆమెను కిడ్నాప్ చేసి మరీ లైంగికంగా దాడి చేయించారు. దిలీప్ నిందితుడు అని తేలడంతో అరెస్టు కూడా చేశారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత భావన మలయాళంలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఐదేళ్ల తర్వాత మలయాళంలో ‘ఎన్టికక్కకురు ప్రేమందార్న్’ సినిమాలో నటిస్తోంది భావన. ‘హనీ బి’ తర్వాత భావన, లాల్‌ జూనియర్‌ దర్శకత్వంలో నటించిన ‘నడికర్‌’ కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. టోవినో థామస్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భావన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎదుర్కొన్న గాసిప్స్‌ను బయటపెట్టమని యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను చనిపోయిన కబుర్లు కూడా విన్నానని ఆవేదన చెందింది.

- Advertisement -

“చచ్చిపోయానని ఎన్నో విన్నాను. అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నాను, అబార్షన్ చేసి చనిపోయాను, వగైరా ఎన్నో విన్నాను. ఒకరకంగా.. నేను అబార్షన్ గాసిప్ విని విసిగిపోయానంటూ పేర్కొంది. పెళ్లికి ముందు రూమర్స్ విన్నప్పుడల్లా మానసికంగా కృంగిపోయే దానిని.. కానీ వివాహమైన తర్వాత తన భర్త అండతో బలంగా మారానని చెప్పింది. ఇక భావన హీరోయిన్ గా నటిస్తున్న నడికార్‌లో టోవినోతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్, షైన్ టామ్ చాకో, లాల్, బాలు వర్గీస్, అనూప్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యర్నేని, వై. అనూప్ వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో నడికార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here