Guess The Actor : ఈ ఫోటోలో చిన్నారిని గుర్తుపట్టారా.. ప్రజెంట్ ఎంత హాట్ గా తయారైందో

- Advertisement -

Guess The Actor : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్స్ కొత్త విషయాలు కనుక్కునేందుకు వెతుకుతూనే ఉంటున్నారు. ప్రజెంట్ నెటిజన్స్ ఎక్కువగా సెలబ్రెటీలకు సంబంధించిన పాత విషయాలను తిరగ తోడుతున్నారు. త్రో బ్యాక్ ఫోటోస్ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెండితెరపై స్టార్లుగా కొనసాగుతున్న తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో చూసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య తారల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం మరో అందాల ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న చిన్నారి ప్రజెంట్ వెండితెర హాట్ బ్యూటీ. ఫోటోలో చిన్నారి పెళ్లి కూతురిగా ముస్తాబై కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. కళ్లు చెదిరే అందం, అద్భుత అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారికి సౌత్ ఇండస్ట్రీలో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ క్యూటీ చేతిలో ఒకటి అర చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?… తనేనండి అందాల నిధి దాచుకున్న నిధి అగర్వాల్.

నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె నర్తకిగా కనిపించనున్నట్లు సమాచారం. మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమున్న నిధి.. 2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత హిందీలో మున్నా మైఖేల్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన మజ్ను సినిమాలో మెరిసింది. ఈ మూవీ కూడా నిధికి నిరాశే మిగిల్చింది. కానీ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధికి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శింబు జోడిగా ఈశ్వరన్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో మాత్రం ఒకే సినిమాలో కనిపించింది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here