Jaragandi : వామ్మో.. రామ్ చరణ్ జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..!

- Advertisement -

Jaragandi : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తన ప్రతి సినిమానూ ఓ రేంజ్ లో తీసే అలవాటున్న శంకర్.. ఈ మూవీలోనూ జరగండి అనే ఓ సాంగ్ కోసం భారీగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడిదే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా ఈ జరగండి నిలవడం విశేషం. గేమ్ ఛేంజర్ మూవీలోని ఈ జరగండి పాట కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారు.

SK Times: Game Changer - Jaragandi Jaragandi Full Song, First Single, Ram  Charan, Shankar, Release - YouTube

 

- Advertisement -

ఇంత భారీ బడ్జెట్ తో మూడు, నాలుగు చిన్న సినిమాలనే తీసేయొచ్చు. ఈ పాటతో రామ్ చరణ్ ఇప్పుడు షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. నిజానికి ఈ సినిమాలోని అన్ని పాటలపై శంకర్ భారీగా ఖర్చు చేశాడు. అయితే ఈ పాట కోసం చేసిన ఖర్చు వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ మధ్యే గేమ్ ఛేంజర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న తమన్ ఈ జరగండి సాంగ్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది. అయితే ఏకంగా ఒక్క పాట కోసమే రూ.20 కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం మామూలు విషయం కాదు. ఈ భారీ ఖర్చుతో జరగండి ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా నిలిచింది.

Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి.. - NTV  Telugu

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘జరగండి జరగండి’ అంటూ వచ్చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో హై ఎనర్జీ బీట్స్ తో చరణ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులను కూడా అలరిస్తోంది. అద్భుతమైన లిరిక్స్ తో అదరగొడుతున్న ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా.. సింగర్స్ డాలర్ మెహందీ, సునిది చౌహాన్ తమ గాత్రంతో మెస్మరైజ్ చేశారు. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఎంతో కలర్ ఫుల్ గా, గ్రాండియర్ గా ఈ సాంగ్ తెరకెక్కింది. జరగండి పాట సినిమాకే హైలెట్ గా నిలవనుంది. థమన్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ తో అలరించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here