Rekha : ఆ హీరో నన్ను బలవంతం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలనం

- Advertisement -

Rekha : హీరోయిన్ రేఖ ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించింది. సినిమా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడూ ఆమె బిజీగానే ఉంటారు. అమితాబ్‌తో రేఖకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఇప్పటికీ పుకార్లు ఉన్నాయి. బ్రైట్ బనారసీ చీర, పెద్ద జుట్టు, ఎరుపు లిప్‌స్టిక్‌, నుదుట సింధూరం ఆమె అందానికి ఇప్పటికీ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రేఖ ఈ లుక్‌కి అందరూ ఫిదా కావాల్సిందే. నేటికీ ఎవర్‌గ్రీన్ నటి రేఖ. ఆమె వేదిక పై డ్యాన్స్ చేసిందంటే ఆ హాల్ చప్పట్లతో మార్మోగిపోవాల్సిందే. పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. నేటి జనం ఆమెను చూసి కాపీ కొడుతుంటారు. రేఖ పేరు పలు వివాదాల్లో ఉంది. రేఖ తన పుస్తకంలో ఈ కథల గురించి పేర్కొంది.

రేఖ తన పుస్తకం ‘రేఖా ది అన్‌టోల్డ్ స్టోరీ’లో – ఆమెకు 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె ఒక బెంగాలీ చిత్రంలో పని చేసింది. ఈ సినిమా సమయంలో రేఖ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని పేర్కొంది. రేఖ నటించిన ఆ సినిమా పేరు అంజనా. 1969లో విడుదలైన ఈ చిత్రంలో రేఖ సరసన తన కంటే 25 ఏళ్లు పెద్ద నటుడు బిస్వజిత్ ఛటర్జీని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించి పెద్ద దుమారమే రేగింది.

- Advertisement -

రేఖ తన పుస్తకంలో సినిమా సన్నివేశం గురించి వివరిస్తూ – సినిమాలో రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఈ సన్నివేశంలో బిస్వజిత్ ఛటర్జీ రేఖను ముద్దాడాల్సి వచ్చింది. బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు అంతగా కనిపించని కాలం ఇది. నటీమణులు అలాంటి సన్నివేశాలను సొంతంగా చిత్రీకరించడానికి ఇష్టపడరు. రేఖ మాట్లాడుతూ- ‘ఈ బెంగాలీ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు ఆమెకు ఊపిరిరాడనివ్వలేదు. బిశ్వజిత్ ఛటర్జీ ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. దీని కారణంగా నటి మొదట షాక్ అయ్యి, ఆపై ఏడ్వడం ప్రారంభించింది. ఈ సన్నివేశంలో ఆయనను అప్పుడు ఎవరూ ఆపలేదు, అందుకు బదులుగా యూనిట్‌లో ఉన్న వ్యక్తులు చప్పట్లు, ఈలలు వేస్తూ అక్కడే షో చూస్తూ నిలబడి ఉన్నారు. ఈ సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డు నుంచి డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ముద్దులు పెట్టుకోవడం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారమని కోర్టు కొట్టివేసింది. ఇద్దరూ దీనికి అంగీకరిస్తే, మూడవ పక్షం ఏ సమస్యనూ ఎదుర్కోకూడదని కోర్పు భావించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here