Teja sajja : తేజ సజ్జాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహేష్.. నీలో ఈ యాంగిల్ చూడలేదు బాసూ

- Advertisement -

Teja sajja : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్‌ ఉందో తెలిసిందే. ఎటువంటి కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ కాకుండా జెంటిల్‌ మాన్ గా రోజు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటున్నారు. స్టార్ హీరోగా వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించి మెప్పించాడు ప్రిన్స్. ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఃఅయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా కు పోటీగా యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో మహేష్ బాబు కంటే తేజ సజ్జా హనుమాన్ సినిమానే ఎక్కువ సక్సెస్ అందింది. అయితే హనుమాన్ మూవీ ప్రమోషన్స్ తర్వాత తేజ సజ్జ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు. తనను ఓ విషయంలో మహేష్ తిట్టారని.. ఆయన చెప్పుకొచ్చాడు. యువరాజ్ మూవీలో మహేష్ బాబు కొడుకుగా తేజా సజ్జ నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఓ ఇంటర్వ్యూలో తేజ సజ్జా మాట్లాడుతూ మహేష్ గురించి టాపిక్ రాగా.. యువ‌రాజు సినిమా టైంలో నేను చాలా చిన్న పిల్లవాడు కావడంతో మహేష్ బాబును.. మగేశ్‌ బాబు, మగేశ్‌ బాబు అంటూ పిలిచేవాడినని అందుకు మహేష్ బాబు కాస్త ఫీలై నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ంటూ వివరించాడు. నీకు పిలవడం రాకపోతే మానేయి. అంతే కానీ అలా మాత్రం పిలవకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఆ విషయాన్ని స్వయంగా తేజ సజ్జా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. మహేష్ బాబుతో తనకున్న స్వీట్ మెమరీస్ ను గుర్తు చేసుకున్నాడు. అయితే మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ ప్రస్తుతం మహేష్ తో పోటీగా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here