Tollywood Heroines : దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇంటి ముందు ముగ్గులు.. వంటింట్లో పండగ స్పెషల్ స్వీట్స్.. మేడపై ఎగురుతున్న పతంగులతో దేశమంతా కళకళలాడుతోంది. సంక్రాంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ హీరోయిన్లు ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు. బాపు బొమ్మల్లా అందంగా రెడీ అయి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు షేర్ చేసుకున్నారు.
తమిళ పొన్ను త్రిష గురించి తెలియని తెలుగు కుర్రాళ్లుండరు. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో ముంచేసింది త్రిష. పండుగ పూట ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకునే అమ్మాయిలు త్రిష కట్టుకున్న చీర చూడండి. చీరలో ఓవైపు సంప్రదాయంగా కనిపిస్తూనే మరోవైపు ట్రెండీగా మెరిసిపోతోంది ఈ భామ.
సాయి పల్లవి.. ఫిదా మూవీతో తెలుగు కుర్రాళ్లను ఫిదా చేసి తన మాయలోకి దింపింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా కనిపించని ఈ బ్యూటీ సంక్రాంతి సందర్భంగా రెడ్ శారీలో అదరగొట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
అతిదిరావ్ హైదరీ.. ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెలుగు రాజకుమారి అయిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ భామ నటుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నట్లు బీ టౌన్లో టాక్.
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లో కెరటం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లి తెలుగు తెరపై నంబర్ వన్‌గా నిలిచింది. గత కొంతకాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది. అక్కడే బీ టౌన్ నటుడు, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది.