ఆ షో అంటేనే అసహ్యం.. సాయిపల్లవి కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్సాయి పల్లవి.. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చేసింది చేతివేళ్లతో లెక్కబెట్టుకోగలిగే సినిమాలే అయినా.. వాటి ద్వారా ఆమె ప్రేక్షకులపై చూపిన ఇంపాక్ట్ ఎక్కువ. అందుకే ఆమెను సాయిపల్లవి అనేకంటే.. ఆమె నటించిన క్యారెక్టర్ల పేర్ల (మలర్, భానుమతి, చిన్ని, రోజీ)తోనే పిలుచుకుంటారు. సాయిపల్లవి అనగానే స్వచ్ఛమైన నవ్వు.. రంగు వేయని ముఖం.. అందమైన మనస్సుతో పాటు గుర్తొచ్చేది డ్యాన్స్. తను డ్యాన్స్ చేస్తోందంటే.. ఎంతటి అగ్రహీరోలైనా సరే ఆమె పక్కన స్టెప్పేయడానికి కాస్త ముందే ప్రిపేర్ అవుతారు. అంతటి స్టార్ డ్యాన్సర్, గ్రేట్ హీరోయిన్ సాయిపల్లవి.. ఇటీవల డ్యాన్స్ షోలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు సాయిపల్లవి అంటే ఎంతో ఇష్టపడే అభిమానులు కూడా తనపై ఫైర్ అవుతున్నారు. ఎంత ఇష్టం లేకపోయినా.. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.  డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం అంటూ చేసిన సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇంతకీ సాయిపల్లవి ఏం అందంటే.. డ్యాన్స్ షోలల్లో ప్రతిభకు గౌరవం ఇవ్వరని.. డబ్బు లేదా ప్రముఖుల వారసులకే ప్రాధాన్యం ఇస్తారని అంది. అందుకే ఆ షోలంటే తనకు అసహ్యమని చెప్పింది. పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తనకు హీరోయిన్ గా ఈ స్థాయి క్రేజ్ దక్కిందంటే కేవలం డ్యాన్స్ వల్లేనని.. అలాంటి డ్యాన్స్ కు గ్రేట్ ప్లాట్ ఫామ్ అయిన షోలను అవమానపరిచేలా మాట్లాడ్డం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు.