ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో నన్ను అనేక మంది లైంగిక వేధింపులకు గురి చేసారు. అందులో కొంతమంది టాలీవుడ్ దర్శకులు కూడా ఉన్నారు. ఒక డైరెక్టర్ కోరికని తీర్చలేక ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ కుటుంబం గుర్తుకువచ్చి ఆగిపోయాను. ఎవరో నీచుడు కోసం నేను ఎందుకు చావాలి అని అనుకున్నాను’ అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడింది. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు ఏమిటి అనేది మాత్రం ఆమె బయటకి చెప్పలేదు. ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్ కి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇక తల్లిదండ్రులైనా ఒక అమ్మాయి సినీ పరిశ్రమకి వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటారు చెప్పండి. మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎందుకు ఉండరు అంటే అందుకు కారణం ఇదే. ఇకపోతే ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన రెండు చిత్రాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ‘దేవదాసు’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఇలియానా, ఆ చిత్రం తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అనతి కాలం లోనే కోటి రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. అయితే జులాయి చిత్రం తర్వాత ఇలియానా జోరు బాగా తగ్గిపోయింది. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు అవకాశాలు మెల్లగా తగ్గుతూ పోయాయి. దీంతో హిందీ లో ప్రయత్నాలు చేసింది కానీ, అక్కడ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాలేదు.