Indra Movie Collections : నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంద్ర చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పిన ఈ చిత్రంకి జనాల్లో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదని నిన్న ఈ సినిమా షోస్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థం అవుతుంది. ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రతీ థియేటర్ లో అభిమానుల కోలాహలం తో రెండు తెలుగు రాష్ట్రాలు నిన్న పండగ వాతావరణం ని నెలకొల్పాయి. నేటి తరం మెగా ఫ్యాన్స్ అప్పట్లో ఇంద్ర మొదటి రోజు హంగామా ఎలా ఉండేదో బాగా మిస్ అయ్యుంటారు. ఆ స్థాయి కోలాహలం ఇప్పుడు లేకపోయినా, అప్పట్లో ఎలా ఉండేదో నిన్న ఒక చిన్న టీజర్ లాగా వాళ్ళ మైండ్ లో ఫ్లాష్ అయ్యింది.
ముఖ్యంగా ఓవర్సీస్ లో మెగాస్టార్ కి ఈ రేంజ్ క్రేజ్ ఉందా అని ప్రతీ ఒక్కరు నోర్లు వెళ్ళబెట్టేలా చేసింది ఇంద్ర రీ రిలీజ్. ఉదాహరణకి నార్త్ అమెరికా లో మురారి చిత్రానికి క్లోసింగ్ లో 60 వేల డాలర్లు వస్తే, ఇంద్ర చిత్రానికి కేవలం మొదటి రోజు 80 వేల డాలర్లు వచ్చాయి. ఇది ఒక్క ఆల్ టైం రికార్డు. సరైన ప్లానింగ్ లేకపోయినా, కేవలం రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినా కూడా ఈ స్థాయి ఓపెనింగ్ అంటే మెగాస్టార్ మాస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రాంతాలలో నిన్న అదనపు షోస్ డిమాండ్ ని బట్టి వేసుకుంటూ వెళ్లారు.
అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇది సీనియర్ హీరోలలో ఆల్ టైం రికార్డు , అలాగే చాలా మంది నేటి తరం హీరోలకు కూడా ఈ స్థాయి రికార్డు వసూళ్లు రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కి మాత్రమే నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ వరకు షోస్ ఉంటుంది కాబట్టి, ఫుల్ రన్ లో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ ఈ చిత్రం ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడితే ఖుషి, మురారి తర్వాత టాప్ 3 గా నిలిచే అవకాశం ఉంది.