Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరో గా మాత్రమే కాదు, ఒక మనిషిగా కూడా తాను ఎంత ఉన్నతమైన వ్యక్తి అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు అందించిన మహానుభావుడు ఆయన. కరోనా సమయంలో ఆక్సిజన్ సీలెండర్స్ కొరతతో ఎంతోమంది ప్రాణాలను వదలడం మనమంతా గమనించే ఉంటాము. ఆ సమయంలో చిరంజీవి ముందుకొచ్చి, ఎన్నో వేల ఆక్సిజన్ సిలెండర్స్ ని రెండు రాష్ట్రాల్లో ఉచితంగా అందించాడు. ఇలాంటి గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అంతేకాదు సినీ ఇండస్ట్రీ లో ఎవరికీ ఏ కష్టమొచ్చినా ఆపద్బాంధవుడిగా వాళ్ళ కోసం ముందు ఉండే మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి మాత్రమే.
కరోనా సమయం లో ఎంతో మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించిన ఉదారహృదయుడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనని కోట్లాది మంది అభిమానులు ఒక దేవుడిలాగా కొలుస్తారు. ఇది ఇలా ఉండగా నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి తో తమకి ఉన్న అనుబంధాన్ని, ఆయన గొప్పతనాన్ని నెమరు వేసుకున్నారు. చిరంజీవి పలు చిత్రాలలో విలన్ గా నటించిన పొన్నాంబలం కి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు చిరంజీవి ఆయన పట్ల చూపించిన దయ గురించి నిన్న జరిగిన వేడుకల్లో పంచుకొని ఎమోషనల్ అయ్యాడు. సొంతవారే ఆయన్ని పట్టించుకోలేదు.
అలాంటిది చిరంజీవి అతని ఆరోగ్యం బాగుపడి, ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేందుకు 60 లక్షల రూపాయలతో చికిత్స చేయించాడు. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాలలో చెప్పాడు, నిన్న పుట్టినరోజు సందర్భంగా మరోసారి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఒకసారి చిరంజీవి గురించి మాట్లాడుతూ ప్రతీ రోజు ఆయన ఎంతో మందికి ఆర్ధిక సహాయం చేస్తుంటాడు. ఎన్నో లక్షల రూపాయిలు రోజుకి ఆయన పంచుతూనే ఉంటాడు, కానీ అవి బయటకి చెప్పుకోడు అంటూ చిరంజీవి గురించి ఒక సందర్భంలో చెప్తాడు. మన ఇంట్లో మన రక్తం పంచుకొని పుట్టిన వారే సహాయం చేసేందుకు ముందుకు రాని ఈరోజుల్లో చిరంజీవి లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఉండడం నిజంగా మనం చేసుకున్న గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ఇలాంటి వారిని ఆ దేవుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచాలని ప్రార్థిద్దాము.