Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ఆడియన్స్ లో అమితాసక్తిని రేకెత్తించింది. టీజర్ , ట్రైలర్ , సొంగ్స్ ఇలా అన్నీ కూడా సినిమాపై బజ్ ని పెంచాయి. ప్రొమోషన్స్ కూడా విన్నూతన రీతిలో చేస్తున్నారు. ఈ ప్రొమోషన్స్ ద్వారా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. చిన్నప్పటి నుండి విపరీతమైన కోపం గా ఉండే హీరో, తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు.
దానివల్ల ఎదురైనా సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని పలు ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కి, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు. దీనికి వాళ్ళ నుండి అద్భుతమైన రివ్యూస్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో ఉంటుందట. ఆ రేంజ్ ట్విస్ట్ ఏమిటి?, సీక్వెల్ కి లీడ్ ఇచ్చేలా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తాయి. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ కారణంగా ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళిపోతుందని, నాని ని స్టార్ హీరో గా నిలబెడుతుంది అని ఈ సినిమాని చూసినవాళ్లు చెప్తున్న మాట.లాంగ్ వీకెండ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి, నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్ళిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతం లో నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో అనుకున్న స్థాయిలో బాక్స్ ఆఫీస్ వసూళ్లను సాధించలేకపోయింది. కానీ ఈసారి మాత్రం గురి తప్పదని, ఈ చిత్రం తో నాని వంద కోట్ల రూపాయిల గ్రాస్ కాదు, వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకుంటాడని అభిమానులు చెప్తున్నారు. మరి అది జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.