Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసిందా..?



 

Rakul Preet Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోకస్ అంతా ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఉంది. ఈ బ్యూటీ ఇప్పుడు అక్కడ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఛత్రివాలీ మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. అయితే ప్రజెంట్ ఈ భామ చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు.

Rakul Preet Singh
Rakul Preet Singh

‘కెరటం’ సినిమాతో అరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఇక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఈ బ్యూటీ వరుస అవకాశాలు దక్కించుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Actress Rakul Preet Singh
Actress Rakul Preet Singh

గత కొంతకాలంగా రకుల్ తెలుగు సినిమాలకు దూరమైంది. కొండపొలం మూవీ తర్వాత ఈ భామ ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ సమయంలో బాలీవుడ్ పై కాన్సంట్రేట్ చేసింది. అక్కడ థాంక్ గాడ్, డాక్టర్ జీ, ఛత్రివాలీ వంటి కంటెంట్ బేస్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 

Rakul Preet Singh Photos
Rakul Preet Singh Photos

ఇక బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ఈ బ్యూటీ లవ్ లో పడింది. తరచూ వెకేషన్స్ కు వెళ్తూ ఈ బ్యూటీ తన లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా న్యూ ఇయర్ కోసం ఈ జంట వెకేషన్ కు వెళ్లి తిరిగొచ్చింది. ఆ తర్వాత ఛత్రివాలీ మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయింది రకుల్.

Actress
Actress

బాలీవుడ్ పైనే రకుల్ ఫోకస్ పెట్టడంతో తెలుగు ప్రేక్షకులు ఈ భామను తెగ మిస్ అవుతున్నారు. రకుల్ ఇక సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసిందా అని ఫీల్ అవుతున్నారు. హిందీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో అక్కడి సినిమాలే చేస్తోంది రకుల్. మంచి కంటెంట్ తో తెలుగు దర్శకులు ఎవరైనా అప్రోచ్ అయితే టాలీవుడ్ కు తిరిగొచ్చేస్తానని చెబుతోంది ఈ బ్యూటీ.