Waltair Veerayya : ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ‘వాల్తేరు వీరయ్య’. మాట వినిపిస్తోంది.. ఆ సీన్ ఒక్కటి లేదని చాలామంది బాధపడుతున్నారు. అంతేకాదు ఆ సీన్ గనుక ఉంటే వాల్తేరు వీరయ్య సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అని భావిస్తున్నారు.మరి ఇంతకీ వాల్తేరు వీరయ్య సినిమాలో మిస్ అయిన సన్నివేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి శృతిహాసన్ జంటగా రవితేజ కీలక పాత్రలో నటించిన తాజా సినిమా వాల్తేరు వీరయ్య (waltire veerayya)..ఈ నెల 13 న సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది..
అయితే ఈ సినిమా ఓ సీన్ వుంటే సినిమా భారీ హిట్ అయ్యేదని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.అదేంటంటే టీజర్‌లో చూపించిన ఓ సన్నివేశం సినిమాలో లేదు..వాడు వస్తే పూనకాలు అన్నారు.. వాడు అడుగేస్తే అరాచకం అన్నారు..మరి సౌండ్ ఏమీ లేదు ఏంటి అని వాల్తేరు వీరయ్య టీజర్ లో ఓ రౌడీ అంటాడు.. ఇక అలాంటి టైంలోనే చిరంజీవి ఎలాంటి సౌండ్ చేయకుండా ఆ రౌడీ కింద ఉన్న బాంబు ని పేల్చడం అలాగే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు ఇంకా కావాలంటే దాని కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనే ఓ డైలాగ్ తో ఆ ప్రోమో ని పూర్తి చేయడం అప్పట్లో ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది.
ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఈ సన్నివేశం మాత్రం సినిమాలో లేదు. అయితే ఈ ఒక్క సన్నివేశానికి చాలామంది జనాలు అలవాటు పడ్డారు.. దాంతో ఈ సీన్ సినిమాలో ఉంచితే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలామంది సినీ ప్రియులు భావిస్తున్నారు.. మొత్తానికి ఈ సినిమా మాత్రం ఓ మాదిరి టాక్ తో అలరిస్తుంది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాతో ఢీ కొట్టలేదని తెలుస్తుంది..ఈ సినిమా తర్వాత మరో సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు..