సినీ ప్రముఖులకు NTR విందు.. రామ్ చరణ్ రాకపోవడానికి కారణం ఇదేనా?NTR తన ఇంట్లో సినీ ప్రముఖులకు, సన్నిహితులకు ఎప్పుడూ పార్టీని ఇస్తాడు.. ఇప్పుడు కూడా గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు.RRR సినిమాలో భీమ్ పాత్రతో తారక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు మారుమోగి పోతుంది..ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు విందుకు ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కోసం ఈ డిన్నర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విందుకు ట్రిపుల్ డైరెక్టర్ రాజమౌళితో పాటు సినీ నిర్మాతలు మైత్రి మూవీస్ నవీన్, శిరీష్ రెడ్డి, బాహుబలి నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవిని, ఆయన తదుపరి సినిమా దర్శకుడు కొరటాల శివ హాజరయ్యారు. స్పెషల్ డిన్నర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTR
NTR

ప్రస్తుతం తారక్ తన 30వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ డిన్నర్ పార్టీ పెట్టడం వెనుక ఆంతర్యం ఇంకా పూర్తిగా తెలియలేదు… ఈ పార్టీకి హాలివుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ తారక్ తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. జేమ్స్, ఎమిలీని కలవడం చాలా బాగుంది. మీ మాటను నిలబెట్టుకున్నందుకు, విందు కోసం మాతో చేరినందుకు ధన్యవాదాలు అని తారక్‌ తన క్యాప్షన్ తో ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.

jr

తారక్ ఇచ్చిన ఈ విందుకి, భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం తనకు నచ్చిన వారిని మర్యాదపూర్వకంగా భోజనానికి పిలుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విందుకు దర్శకుడు నాగవంశీ, స్వప్న దత్ కూడా హాజరయ్యారు. కానీ ముందుగానే వెళ్లిపోయారు. సుకుమార్‌కి ఆహ్వానం అందినప్పటికీ, పుష్ప 2 కోసం వైజాగ్‌లో బిజీగా ఉన్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు కూడా ఆహ్వానం అందింది కానీ ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈఫోటోలో దిల్ రాజు సోదరుడు కనిపిస్తున్నాడు. అయితే ఇందులో మెగా హీరో లేడనే చర్చ సాగుతోంది. ఊహించని సమావేశంలో, జేమ్స్ మరియు ఎమిలీ ఈ విందుకు ప్రత్యేకంగా రావడం…ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ సహనటుడు రామ్ చరణ్ విందుకు హాజరు కాకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.. అసలు ఏమైంది ఎందుకు రాలేదో అభిమానులు కూడా ఆలోచిస్తున్నారు.. మరి దానిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్గా మారాయి..