Nayanatara: రాశీఖన్నా పేరు చెబితే మండిపడుతున్న నయనతార.. అన్యాయం అంటున్న నెటిజన్లు



Nayanatara తన నటనతో అందరినీ ఆకట్టుకుని లేడీ సూపర్‌స్టార్‌ అని పేరు తెచ్చుకున్నారు హీరోయిన్‌ నయనతార (Nayanthara). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. గతేడాది నయనతార పెళ్లి చేసుకోవడంతో ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పనుందని ప్రచారం జరిగింది. గతంలో అంగీకరించిన సినిమాల్లో మాత్రమే నటిస్తుందని అందరూ అనుకున్నారు. ఆ రూమర్స్‌కు బ్రేక్‌ వేస్తూ నయనతార పలు సినిమాలు ఒప్పుకుంది.

Nayanatara
nayanatara

ఇంత వరకు కథ బానే ఉన్నా నయనతార ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా అంటే మండిపడుతోందిట. దానికి కారణం లేకపోలేదు. నయనతార ఒప్పుకున్న ఓ సినిమాలో ఆమెను తప్పించి రాశీని ఎంపిక చేశారట ఆ చిత్ర యూనిట్. నయనతార తమిళంలో వైనాట్‌ శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో మొదట హీరోయిన్‌గా ఎంపికైంది. ఇది లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్. ఇందులో మాధవన్‌, సిద్ధార్థ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం నుంచి నయనతార తప్పుకుందట. దీంతో ఆ ఆఫర్‌ రాశీఖన్నాకి వచ్చిందని సమాచారం.

rashi

ఇక రాశీఖన్నా ఇటీవల వచ్చిన ఫర్జీలో తన అద్భతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె హిందీలో నటించిన యోధ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన డబ్బింగ్‌ వర్క్ లో పాల్గొంది రాశీఖన్నా. దీంతోపాటు కొచ్చిలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. రాశీఖన్నా తెలుగులో చివరగా పక్కా కమర్షియల్‌, థ్యాంక్యూచిత్రాల్లో నటించి పరాజయాలు మూటగట్టుకుంది.