Bollywood Beauty : పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ బ్యూటీ.. ఎవర్ని చేసుకోబోతోందో తెలుసా..?

- Advertisement -

Bollywood Beauty : గత ఏడాది నుంచి వరుసగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీల హీరోయిన్ల పెళ్లిళ్ల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదిలోనూ పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్​, తాప్సీ పన్ను, అదితి రావు హైదరి, అపర్ణ దాస్ పెళ్లి వార్తలు తాజాగా వినిపించిన విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్, తమన్నా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ అని గ్రాండ్ గా చేసుకుంటే.. ఇంకొందరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్​ కూడా ఓ ఇంటి కోడలు కాబోతోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లై చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మేఘా ఆకాశ్. ఈ భామ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో.. దాని కింద ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట చర్చకు తెరలేపింది. ఈ భామ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే వార్తలకు ఊతమిచ్చింది. ఈ బ్యూటీ చేతికి మెహిందీ పెట్టుకుని.. సంప్రదాయంగా చీర కట్టుకుని తన మెహిందీ పెట్టుకున్న చేతులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసింది. ఆ ఫోటో కింద #weddingvibes అనే హాష్ ట్యాగ్ కూడా ఉపయోగించడంతో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోందంటూ వార్తలు చక్కర్లు కొట్టడం షురూ అయ్యాయి.

- Advertisement -

కేవలం ఫొటో పెట్టి ఉంటే మెహిందీ డిజైన్ చూపిస్తుందని అనుకునే వారు నెటిజన్లు. ఎవరిదైనా పెళ్లికి అటెండ్ అయ్యి ఉంటే వాళ్ల నేమ్స్.. ఆ మ్యారేజ్ డెస్టినేషన్ డీటెయిల్స్ ట్యాగ్ చేసేది. కానీ అలా ఏం చేయకుండా కేవలం #weddingvibes అనే హాష్ ట్యాగ్ యూజ్ చేయడంతో నెటిజన్లు ఇప్పుడు ఈ భామ పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ షురూ చేశారు.

కొందరేమో గుడ్ లక్, బెస్ట్ విషెస్ అంటూ కంగ్రాట్స్ చెబుతుంటే.. ఇంకొందరేమో.. తన పెళ్లి కాదని, ఎవరిదో పెళ్లికి వెళ్లినప్పుడో.. లేదా ఏదైనా షూటింగ్ లో ఫొటోనో అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి మేఘ పెళ్లి గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇప్పుడే కాదు గత ఏడాది కూడా మేఘ ఆకాశ్​ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చాయి. ఈ భామ చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే వాటి గురించి మేఘ కుటుంబం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఇప్పుడు కూడా అటువంటి వార్తలా లేక నిజంగానే ఈ అమ్మడు పెళ్లికి సిద్ధం అయిందా అని తెలీక నెటిజన్లు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

ఇక మేఘ సినిమాల సంగతికి వస్తే.. లై, చల్ మోహన రంగ, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి సినిమాల్లో నటించిన మేఘకు హీరోయిన్​గా పెద్ద గుర్తింపు రాలేదు. రావణాసురలో చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కూడా ఆమె కెరీర్​కు పెద్ద ప్లస్ కాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా షూటింగ్స్​తో బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here