Rashmika Mandana : గ్రీన్ డ్రెస్ లో రష్మిక అందం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

- Advertisement -

Rashmika Mandana : పాన్ ఇండియా హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో తన ఫొటోలతో బాంబ్ పేల్చింది. ఈ సారి ట్రెడిషనల్ ఔట్ ఫిట్ ఈ భామ కనిపించింది. గ్రీన్ కలర్ అనార్కలీ డ్రెస్సులో బ్యూటిఫుల్ ఫొటోషూట్ చేసింది. లూజ్ హెయిర్ తో నుదుట చిన్న బొట్టుతో.. చెవికి పెద్ద జుంకాలతో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రష్మిక చాలా అందంగా ఉంది. ఇక బ్యూటిఫుల్ పోజులిస్తూ తనలోని క్యూట్ నెస్ ను మరోసారి చూపించింది.

నేషనల్ క్రష్ అనే పేరు రష్మికకు ఊరికే రాలేదు. ఈ బ్యూటీ క్యూట్ నెస్ కు మొత్తం నేషన్ ఫిదా అయింది. చాలా ఏళ్ల నుంచి ఈ భామ నేషనల్ క్రష్ గానే ఉంది. ఈ బ్యూటీని బీట్ చేసే క్యూట్ నెస్ ఇంకా రాలేదు. ప్రేక్షకులను ఫిదా చేసి అందం ఇంకా కనిపించలేదు. అలా రష్మిక ఈ గ్లామర్ వరల్డ్ ను ఏలేస్తోంది. లేటెస్ట్ ఫొటోలు చూస్తే అది నిజమేనని మీరూ ఒప్పుకోక తప్పదు. గ్రీన్ కలర్ అనార్కలీ డ్రెస్సులో రష్మిక చాలా చాలా అందంగా కనిపిస్తోంది. క్యూట్ స్మైల్ తో మెస్మరైజింగ్ లుక్స్ తో మైమరిపించింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక రష్మిక ఇప్పుడు సూపర్ బిజీగా ఉంది. ఓవైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్.. ఇంకో వైపు కోలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ భామ యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు కురిపించిందో తెలిసిందే. ఇక ఇందులో గీతాంజలి పాత్రలో రష్మిక అదరగొట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమాల్ పార్క్ తెరకెక్కుతోంది. ఇందులోనూ రష్మిక నటించబోతోంది. ఇదే కాకుండా ఇంకా పుష్ప-2లో నూ రష్మిక నటిస్తోంది. ఇటీవలే ఆ సినిమాలో ఈ బ్యూటీకి సంబంధించిన పాత్ర లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here