‘భోళా శంకర్’ మూవీ రివ్యూ.. మెహర్ రమేష్ మళ్ళీ దొరికేసాడు!

- Advertisement -

నటీనటులు : చిరంజీవి , తమన్నా, కీర్తి సురేష్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుశాంత్ తదితరులు

దర్శకత్వం : మెహర్ రమేష్
సంగీతం : మహతి సాగర్
నిర్మాత : అనిల్ సుంకర
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్

ఈ ఏడాది ప్రారంభం లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానుల్లో నింపిన జోష్ మామూలుది కాదు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘భోళా శంకర్’ అనే సినిమా గత కొంతకాలం నుండి చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ ఇది. ఇక్కడ మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెట్టి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దామని మెహర్ రమేష్ ఇన్ని రోజులు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ అన్నీ క్లిక్ అయ్యాయి. దీనితో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి, మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుండా లేదా అనేది చూడాలి.

- Advertisement -
భోళా శంకర్ రివ్యూ
భోళా శంకర్ రివ్యూ

కథ :

శంకర్ ( మెగాస్టార్ చిరంజీవి ) కోల్ కట్టా లో ఒక టాక్సీ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి తన చెల్లి మహా లక్ష్మి ( కీర్తి సురేష్) అంటే ప్రాణం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అయితే ఆయన బ్యాక్ గ్రౌండ్ లో నెమ్మదిగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠా మొత్తాన్ని అంతమొందిస్తు ఉంటాడు. ఇదంతా మహా లక్ష్మి కి తెలియకుండా చేస్తుంటాడు. మహా లక్ష్మి కి మరియు ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..?, దాని ప్రభావం ఆమె జీవితం పై ఎలా పడింది అనేది వేణీతేరా పై చూడాలి.

విశ్లేషణ :

డైరెక్టర్ మెహర్ రమేష్ కి ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశం ఇచ్చే పొజిషన్ లో లేరు, అలాంటిది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన ఆ అవకాశం ని ఆయన నూటికి నూరు పాళ్ళు న్యాయం అయితే చెయ్యలేదు. చిరంజీవి ఈ చిత్రం లో తన నుండి ది బెస్ట్ ఇచ్చాడు కానీ, మెహర్ రమేష్ మాత్రం న్యాయం చెయ్యలేదు. ఫస్ట్ హాఫ్ లో ఆయన రాసిన కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ కి చిరాకు రప్పించేలా చేస్తుంది. చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటుడిగా డీసెంట్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు రాసినా కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. కానీ మెహర్ రమేష్ కి ఆ టాలెంట్ లేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగానే హ్యాండిల్ చేసాడు అనిపించింది. చిరంజీవి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు.

మెహర్ రమేష్ రాసిన వీక్ సన్నివేశాలను చిరంజీవి తన నటనతో చాలావరకు లేపాడు. కీర్తి సురేష్ తో చిరంజీవి సెంటిమెంట్ సన్నివేశాలు బాగా పండాయి, దీనిని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వొచ్చు. అయితే ఈ చిత్రం లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఖుషి నడుము సన్నివేశాన్ని శ్రీముఖి తో చెయ్యడం చూసే ఆడియన్స్ కి కాస్త ఇబ్బంది కలిగింది అనే చెప్పాలి. చిరంజీవి స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి సన్నివేశాలు చెయ్యడం ఏమాత్రం సరికాదని అభిమానులు అంటున్నారు. అలాంటి సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో చాలానే ఉంటాయి. ఇకపోతే ఈ చిత్రానికి మహతి సాగర్ అందించిన మ్యూజిక్ ఏమాత్రం కలిసి రాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీక్ గా ఉండడం వల్ల చాలా సన్నివేశాలు పండలేదు. ఒకవేళ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరించి ఉంటే, ఔట్పుట్ వేరేలా ఉండేది అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.

చివరి మాట :

కమర్షియల్ మూవీ లవర్స్ ఒకసారి చూడొచ్చు, కొంతమందికి పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించొచ్చు, కొంతమందికి చెత్తగా ఉంది అని అనిపించొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదానిపైనే ఈ చిత్రం భవిష్యత్తు ఆధారపడాలి.

రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here