RGV : చనిపోయిన శ్రీదేవితో కారులో అలాంటి పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిన ఆర్జీవీ

- Advertisement -

RGV : వివాదాల వర్మ.. రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారనడంలో సందేహం లేదు. వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకొంటాడు. ఒకప్పుడు ఎంత మంచి సినిమాలు తీసి ప్రశంసలు పొందాడో.. ఆ తర్వాత పరమచెత్త సినిమాలు తీసి విమర్శల పాలయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే.. వర్మకు శ్రీదేవి అంటే ప్రాణమన్న విషయం అందరికి తెల్సిందే. ఆమె అందానికి తానో బానిసనని పలుమార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చాడు వర్మ.

వర్మ దర్శకత్వంలో శ్రీదేవి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అవి గోవిందా గోవిందా, క్షణ క్షణం. రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇది ఇలా ఉంటే 2018 లో శ్రీదేవి అనూహ్య రీతిలో మరణించింది. ఆరోజు ఎంతమంది ఎలా ఏడ్చారో తెలియదు కానీ, వర్మ మాత్రం పిచ్చివాడినైపోయానని తెలిపాడు. ఆమె స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక పక్కన ఉండి ఉంటుందని, మళ్లీ భూమిపైకి రావాలని మందుకొడుతూ ఎన్నో ట్వీట్స్ కూడా చేశాడు. అప్పుడే కాదు తనకు టైం దొరికనప్పుడల్లా వర్మ, శ్రీదేవిని తలుచుకుంటూ విరహవేదనతో బాధపడుతూనే ఉంటాడు.

- Advertisement -

వర్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఒకప్పుడు కాంట్రవర్సీ సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు తీస్తూ వచ్చిన ఆర్జీవీ ఇప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు. అమ్మాయిల అందాలను పొగుడుతూ.. వారితో బోల్డ్‌గా సంభాషిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈయన చేసిన ఓ పని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ, చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు చేస్తున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో శ్రీదేవి వర్మ పక్కన కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే.. ఆయన సిగరేట్ తాగుతూ కనిపించాడు. ఇక ఆ ఫొటోకు క్యాప్షన్ ఇస్తూ.. శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ వర్మ నువ్వు ఏం చేస్తున్నావ్ అసలు.. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here