Guess The Actor : ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్

- Advertisement -

Guess The Actor : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గంగోత్రి సినిమాతో తెరగేంట్రం చేశాడు. తన రెండో సినిమా ఆర్యతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ఆర్య కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతే కాదు ఈ సినిమాతో యువతుల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఆయనకు కూడా ఆర్యనే తొలి సినిమా. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా వంద రోజులు ఆడింది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఓ రేంజ్ లో మార్మోగిపోయాయి. ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో బన్నీ చుట్టూ కొంతమంది పిల్లలు కనిపిస్తారు.

ఆ పిల్లలలో ఓ క్రేజీ హీరోయిన్ కూడా ఉంది. ఆర్య సినిమాలో బాల నటిగా నటించింది ఆ చిన్నది. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుసగా సినిమాలు చేస్తుంది. ఆ చిన్నారి ఎవరో కాదు హీరోయిన్ శ్రావ్య. అల్లు అర్జున్ తో ఉండే చిన్నారుల్లో కాస్త పెద్దగా కనిపించే ఆ చిన్నారి శ్రావ్య. అప్పుడు బాలనటిగా చేసిన శ్రావ్య ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. పలు సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

- Advertisement -

‘లవ్ యు బంగారం’ సినిమాతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కన్నడ సినిమా రోజ్ తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన ‘నందిని నర్సింగ్ హోం’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. అలాగే తమిళంలో పగిరి, విలాయట్టు ఆరంభం సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తన బ్యూటీఫుల్ ఫోటోలు షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Shravya (@itsshravzshravya)

 

View this post on Instagram

 

A post shared by Shravya (@itsshravzshravya)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here