Naveen Chandra : ఎయిర్ పోర్టులో మొగుడిని ముద్దులతో ముంచెత్తిన హీరో భార్య.. అవాక్కయిన జనాలు

- Advertisement -

Naveen Chandra : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు. అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్నాడు. విలక్షణ పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అన్ని రకాల పాత్రలు చేస్తూ జనాలకు చేరువ అవుతున్నాడు. నవీన్ చంద్ర గత సంవత్సరం ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్ చంద్ర, స్వాతి, శ్రావ్య నవేలి, జ్ఞానేశ్వరి, హర్ష వంటి తదితరులు కీలకపాత్రల్లో శ్రీకాంత్ నగోతి డైరెక్షన్లో మంత్ ఆఫ్ మధు సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

తాజాగా ఈ మంత్ ఆఫ్ మధు సినిమాలోని నటనకు గానూ నవీన్ చంద్ర ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫీచర్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మెల్ యాక్టర్ అవార్డు నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు సినిమాకు దక్కింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఢిల్లీలో అవార్డు తీసుకొని తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్ట్ లో నవీన్ చంద్ర భార్య ఓర్మా తనకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

- Advertisement -

ఆయన భార్య ఓర్మా బొకే తీసుకువెళ్లి విమానాశ్రయంలో నవీన్ చంద్ర కోసం గంటల తరబడి ఎదురు చూసింది. సడెన్ గా తన భార్య ఎయిర్ పోర్ట్ లో అలా ఫ్లవర్ బొకేతో దర్శనమివ్వడంతో హీరో నవీన్ చంద్ర ఆశ్చర్యపోయాడు. తాను అందుకున్న అవార్డుని భార్యకు తీసి చూపించాడు. ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ వీడియోని నవీన్ చంద్ర తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naveen Chandra (@naveenchandra212)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here