SS Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడితే రూ.10వేలు ఇస్తా.. ఎందుకంత కోపం జక్కన్న

- Advertisement -

SS Rajamouli : సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా కృష్ణమ్మ. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని పలువురు అతిథులుగా హాజరయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ ఈవెంట్‍లో ఎస్ఎస్ రాజమౌళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది. జక్కన్న .. మహేశ్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతుంది. అయితే, ఆ సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడు అని రాజమౌళి చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు. అలాగే దేవర గురించి దర్శకుడు కొరటాల శివను కూడా ప్రశ్నించారు. “రాజమౌళి స్పీచ్‍లో ఓపెనింగ్ డే ఎప్పుడు? ఓపెనింగ్ డే రోజు అయినా సినిమా కథ చెబుతారా.. అసలు ఏ జానర్, ఏ సినిమా తీస్తున్నారో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ రెండు విషయాలను చెబుతారని ఆశిస్తున్నాను” అని అనిల్ రావిపూడి అన్నారు.

దీనికి రాజమౌళి సరదాగా స్పందించారు.. అతడిని ఎవరైనా గుద్దేస్తే రూ.10వేలు ఇస్తానని అన్నారు. “ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని.. వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే రూ.10వేలు ఇస్తా” అని అన్నారు. రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి అదే రేంజ్‍లో రెస్పాండ్ అయ్యారు. “దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. రూ.10వేలు అంటే వచ్చేస్తారు” అని అనిల్ స్పందించారు. ఈ సంభాషణ చాలా సరదాగా సాగింది.

- Advertisement -

దాంతో పాటు తనకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరో చెప్పాలన్న ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీంతో ఎన్టీఆర్ అని కొందరు అరిచారు. అయితే, తారక్ తనకు ఫ్రెండ్ కాదని, తమ్ముడిలాంటి వాడన్నారు. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి, బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ తన క్లోజ్ ఫ్రెండ్స్ అని జక్కన్న చెప్పారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు ఇంకా సమయం ఉందని, త్వరలో అప్‍డేట్స్ వస్తాయని ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. కృష్ణమ్మ చిత్రానికి సమర్పకుడిగానూ కొరటాల ఉన్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా మే 10వ తేదీన రిలీజ్ కానుంది. విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో ట్రైలర్ అదిరిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here