Upasana Singh : ఉపాసనను లైంగికంగా వేధించిన డైరెక్టర్.. షాక్ లో అభిమానులు

- Advertisement -

Upasana Singh : సినిమా అనేది రంగుల ప్రపంచం.. మేడిపండు చూడు అన్న సామెతలా పైకి కనిపించినంత అందంగా ఇండస్ట్రీ అనేది ఉండదు. ఇక్కడ పైకి రావాలంటే చాలా కష్టపడాలి. అదే మహిళలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొందరిని సంతృప్తి పరచాలన్న అభిప్రాయం దాదాపు అందరిలో ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వెల్లడించారు. సినిమా వాళ్ల జీవితాలుపైకి అద్దాల మేడలా కనిపిస్తుంటాయి. కానీ లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

దక్షిణాదితో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు కాస్త ఎక్కువే. కొందరు నటీమణులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెప్పేశారు. తాజాగా ఒక బాలీవుడ్ సీనియర్ నటి తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టింది. ఆమె పేరు ఉపాసన సింగ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ..బాలీవుడ్ ప్రేక్షకులకు ఉపాసన సింగ్ సుపరిచితురాలే. దాదాపు 40ఏళ్ల కింద ‘జుదాయి’అనే సినిమాతో ఉపాసన ఇండస్ట్రీకి పరిచయం అయింది. తన మొదటి సినిమాలోనే డ్యుయెల్ రోల్ పోషించి మెప్పించింది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఓ దర్శకుడు హీరో అనిల్ కపూర్‌ సరసన హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానని చెప్పాడని..ఆ తరువాత హోటల్‌కు రమ్మన్నాడని తెలిపింది.

- Advertisement -

రేపు వస్తాననడంతో కారు పంపిస్తానని చెప్పడంతో నేరుగా ఆయన ఉద్దేశం అర్థం అయిందని ఉపాసన చెప్పుకొచ్చింది. దీంతో అతన్ని మందలించాను, మా ఇద్దరి మధ్య పెద్ద గొడవే చోటు చేసుకుంది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, నన్ను చాలా బాధ పెట్టింది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను వారం రోజుల పాటు ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అప్పటికి నా వయస్సు 17 సంవత్సరాలే. ఆ సమయంలో అసలు బయటకు కూడా రాలేదంటూ ఎమోషనల్ అయ్యింది.. ఉపాసన చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here