ఆర్తి అగర్వాల్ తన తండ్రి వల్ల నరకం చూసిందా.. షాకింగ్ విషయాలు చెప్పిన నిర్మాత

- Advertisement -

ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు.. ప్రభాస్‌తో అడవి రాముడు.. అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు.. బాలయ్య బాబుతో క్రిష్ణబాబు.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సీనియర్ నిర్మాత చంటి అడ్డాల. అయితే అల్లరి రాముడు, అడవి రాముడు చిత్రాలు ఆయనకు బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు కాగా.. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించింది అందాల నటి ఆర్తి అగర్వాల్. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగి.. నువ్వు నాకు నచ్చావ్.. నువ్వులేక నేను లేను.. ఇంద్ర, వీడే, సంక్రాంతి, నేనున్నాను వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆర్తి అగర్వాల్.. 2015లో ఆపరేషన్ వికటించి గుండెపోటుతో మరణించారు.

ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్

అయితే ఆర్తి అగర్వాల్ అలా కావడానికి కారణం ఆయన తండ్రే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ఆమె తండ్రి ఆర్తి విషయంలో సరిగా ఉండి ఉంటే.. ఆమె అలా అయ్యేది కాదంటూ ఆర్తి తండ్రి గురించి.. ఆమె మరణం గురించి గతంలో ఓ ఇంటర్య్వూలో షాకింగ్ విషయాలను తెలియజేశారట చంటి అడ్డాల. ‘‘అడవి రాముడు.. అల్లరి రాముడు ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్ చేసింది. నిజానికి అల్లరి రాముడు సినిమాకి ఫస్ట్ చార్మిని హీరోయిన్‌గా పట్టుకొచ్చాం. అయితే నేను పరుచూరి, గోపాల్, ఛార్మి అందరూ కూర్చుని డిస్కస్ చేసిన తరువాత తారక్ లావుగా ఉన్నాడు.. ఛార్మి కూడా బొద్దుగానే ఉంది.. ఇద్దరూ బొద్దుగా ఉంటే స్క్రీన్ మీద తేడా కొడుతుందేమో అనిపించింది. అయితే ఛార్మి అప్పుడు చాలా అందంగా ఉండేది. అందుకే సన్నబడటానికి ప్లాన్ చేద్దాం అంటే టైం లేదు.

‘‘దీంతో ఆర్తి అగర్వాల్ అప్పటికి ఫుల్ సక్సెస్‌లో ఉంది. అందుకే గోపాల్ గారు ఆర్తి అగర్వాల్‌ని పెట్టుకుందాం అన్నారు. అలా అల్లరి రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్‌ని తీసుకున్నాం.. ఆ సినిమా సక్సెస్ కావడంతో అడవి రాముడు సినిమాకి కూడా తీసుకున్నాం. ఆర్తి అగర్వాల్‌తో రెండు సినిమాలు చేసిన నిర్మాతగా నాకు ఆమె మరణ వార్త షాక్‌కి గురి చేసింది’’ అని చెప్పారు. అలాగే ఆమె పూర్తిగా తన తల్లి తండ్రుల మీద ఆధారపడేదని అన్నారట. వాళ్ల నాన్న షూటింగ్ కూడా సహరించేవారు కాదని చంటి అడ్డాల గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here