కథ లేకుండా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాం అంటున్న ‘ఏజెంట్’ నిర్మాత

- Advertisement -

ఏజెంట్ క్రియేటివ్ రంగం లో ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణమైన విషయం, ముఖ్యంగా సినీ రంగం గురించి చెప్పుకోవాలి. ప్రతీ సినిమాని సూపర్ హిట్ చెయ్యాలనే మేకర్స్ తీస్తారు, కొన్నిసార్లు అవి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతుంటాయి, అలాంటి సినిమాలలో ఒకటి అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ అనే చిత్రం. హీరో మరియు డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ తో కలిపి ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 100 కోట్ల రూపాయిలు అయ్యింది.

ఏజెంట్
ఏజెంట్

ఒకప్పుడు ఈ చిత్రానికి భారీ హైప్ ఉండేది కానీ, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్స్ రావడం , షూటింగ్స్ వాయిదా పడడం తో హైప్ మొత్తం డైల్యూట్ అయిపోయింది.దాంతో అంత బడ్జెట్ పెట్టినా కూడా ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 37 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. మొదటి మూడు రోజులకు కలిపి కేవలం 5 కోట్ల రూపాయిల వసూళ్లు మాత్రమే రాబట్టింది, నాల్గవ రోజు నుండి షేర్స్ వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.

అయితే ఏజెంట్ సినిమా పరాజయం పై నిర్మాత అనిల్ సుంకర నేడు ట్విట్టర్ లో స్పందించాడు, ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం మేమే, ఈ సినిమాకి ముందుగా బౌండెడ్ స్క్రిప్ట్ లేదు, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మేము షూటింగ్ ని ప్రారంభించాము, అది అనితరసాధ్యమైన టాస్క్ అని తెలిసినా కూడా డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టి ముందుకు పోయాము, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని అనుకున్నాము,కానీ పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది. ఈ తప్పు నుండి మమల్ని మేము క్షమించుకోలేము కానీ, ఈ తప్పుల నుండి ఎన్నో నేర్చుకున్నాము, భవిష్యత్తులో దానిని సరిదిద్దుకుంటాము. ఇక మా మీద నమ్మకం పెట్టి ఈ సినిమాని కొన్ని బయ్యర్స్ కి చేతులెత్తి క్షమాపణలు చెప్తున్నాను.దయచేసి మమల్ని క్షమించండి’ అంటూ అనిల్ సుంకర పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ ని మీరు కూడా క్రింద చూడవచ్చు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here