Tasty Teja : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. ఓపెనింగ్ కు ఊహించని గెస్ట్

- Advertisement -

Tasty Teja : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారిలో టేస్టీ తేజ ఒకరు. అంతకు ముందే యూట్యూబ్ వీడియోల ద్వారా టేస్టీ తేజకు గుర్తింపు వచ్చినా జబర్దస్త్, బిగ్ బాస్ షోలు అతని రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచాయని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలతో కలిసి టేస్టీ తేజ వీడియోలు చేయగా ఆ వీడియోలు సైతం నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ఈ షోల ఫుడ్ వ్లాగర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి టేస్టీ తేజ ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈయనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈయనకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా చాలా ఫన్నీగా ఉంటూ సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నవంటి తేజ ఏకంగా వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు. అయితే టేస్టీ తేజ కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇరానీ నవాబ్స్ పేరుతో ఆయన ఓ హోటల్ పెడుతున్నానని గతంలోనే వెల్లడించాడు. తన కొత్త బిజినెస్ గురించి టేస్టీ తేజ మాట్లాడుతూ.. నేను కొత్తగా ఒక ప్రయాణం మొదలుపెడుతున్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు మనందరం కలిసి ఎదుగుదామని పేర్కొన్నాడు.

- Advertisement -

ఇప్పుడు ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్‌ చేశారు. కార్పొరేట్‌ స్టయిల్‌లో ఈ టీ బిజినెస్‌ని ప్రారంభించడం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్.. శివన్న అలియాస్ శివాజీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా అమర్ దీప్, ప్రియాంక జైన్, శుభశ్రీ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఇక తేజ ప్రారంభించిన మొదటి బిజినెస్ కావడంతో ఆయనకు మంచి జరుగాలని శివాజీ కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడంతో అభిమానులు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here