Janvi Kapoor : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ కపూర్.. ముహూర్తం, వేదిక ఫిక్స్.. ఎక్కడంటే

- Advertisement -

Janvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినిమాల కంటే.. తన అఫైర్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రియుడు శిఖర్ పహారియాతో అఫైర్ వ్యవహారం నిత్యం మీడియాలో ఏదో ఒక రూపంలో స్ప్రెడ్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలోను, మీడియాలోను ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజిబీజీగా ఉంటున్నారు. దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‍లోనూ అడుగుపెట్టబోతున్నారు. కాగా, శిఖర్ పహారియాతో తాను ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు మీడియా కంటికి చిక్కారు. ఓ సారి తిరుమలకు కూడా కలిసే వచ్చారు. కాగా, తిరుపతిలో శిఖర్ పహారియనాను జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్‌తో ఓ ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ తాజాగా జాన్వీ కంట పడింది. దీనిపై ఆమె స్పందించారు.

జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో కొంతకాలంగా తన బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారిద్దరూ సమయం దొరికినప్పుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకొంటున్నారు. అయితే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొంటారనే విషయం వార్త ఆసక్తిగా మారింది. ఇక తన తల్లి అమితంగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆమె బంగారు పూతతో ఉండే తన తల్లి చీరెను కట్టుకొని పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకొంటారని ఓ వార్తను ఇటీవల ప్రచురించారు.

- Advertisement -

తన పెళ్లిపై వచ్చిన వార్తపై జాన్వీ కపూర్ సైటైర్లు వేశారు. నా పెళ్లి గురించి.. నాకే తొందర లేదు. వీళ్లు తోచినట్టు ఏదేదో రాస్తారు. వీళ్లకు ఎలాంటి వార్తలు రాయాలో.. వారికి ఎక్కడి నుంచి ఇలాంటి సమాచారం వస్తుందో తెలియదంటూ కామెంట్ చేసింది. ఆమె కామెంట్స్‌కు సోషల్ మీడియాలో మంచి కామెంట్ల రూపంలో రియాక్షన్ వస్తుంది. ఆమె ప్రస్తుతం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. అలాగే రాంచరణ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here