Kartika Deepam : పోలీసులను ఆశ్రయించిన కార్తీక దీపం హీరోయిన్.. లైగింక వేధింపుల పై ఫిర్యాదు

- Advertisement -

Kartika Deepam : ఇండస్ట్రీ అనేది మాయా ప్రపంచం. బయటకు కనిపించేంత మంచిగానైతే ఉండదు. అక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో మహిళలు పైకి రావాలంటే కొందరిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఇటీవల ఎంతో మంది నటీనటులు తమ ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే అవకాశాల కోసం కమిట్‌మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ కొందరు మాత్రం బయటపడడం లేదు. కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్‌కు గురవుతున్నట్లు కొందరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేసి అలాంటి వారికి బుద్ది చెప్తున్నారు. తాజాగా, కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ కూడా ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలు మేటర్ లోకి వెళితే.. బుల్లితెన నటి అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సీరియల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అమూల్య కార్తీక దీపం సీరియల్ తో పాటు గుండెనిండా గుడిగంటలు అనే మరో సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఆమెను సూర్య అనే వ్యక్తి సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగిక వేధింపులకు గురి చేశాడట. దీంతో అమూల్య ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘ సూర్య అనే వ్యక్తి తనను కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. నన్ను ఆడిషన్‌కు పిలిచి.. అది అయిపోయిన తర్వాత అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతున్నాడు. లైంగికంగా వేధించడం తో నేను అతడిని నిలదీశాను.

- Advertisement -

దీంతో అతను నన్ను పోలీసులకే కాదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని నేను కోరుతున్నాను. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయడం వల్ల మరో మహిళ ఇలాంటి వారికి బలి కాకుండా ఉంటుంది’’ అని ఫిర్యాదులో పేర్కొంది. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సూర్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ నెట్టింట్లో ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here