Sukumar : దిల్ రాజుతో గొడవ.. వెంటనే వెళ్లి కాళ్లు మొక్కిన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్

- Advertisement -

Sukumar : అల్లు అర్జున్ ఆర్య సినిమా మే 7 2004 న విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ టర్న్ అయింది. ఆర్య సినిమా విడుదలై దాదాపు 20ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఆ చిత్రబృందం ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ ఆర్య మూవీ లో పనిచేసిన వాళ్లంతా వచ్చి సందడి చేశారు. అందరూ ఆర్య సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. అంతకు ముందు సుకుమార్ దిల్ సినిమాకు వినాయక్ దగ్గర పనిచేశాడు. దిల్ నిర్మాత దిల్ రాజుకి అప్పుడు ఓ లైన్ చెప్తే బాగా నచ్చడంతో దిల్ హిట్ కొడితే నీకు సినిమా ఇస్తా అని హామీ ఇచ్చాడు. చెప్పినట్టే దిల్ హిట్ అవ్వగానే సుకుమార్ కి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు.

అయితే సినిమా జర్నీలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట. ఒకరిపై ఒకరు కోపాలు, అరవడాలు, అలగడాలు.. ఇలా చాలానే జరిగాయట. ఒక సారి అయితే మూడు రోజుల వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని దిల్ రాజు, సుకుమార్ ఆర్య 20 ఏళ్ల వేడుకలో తెలిపారు. సుకుమార్ మరో సంఘటన గురించి కూడా చెప్పారు.

- Advertisement -

ఆ ఈవెంట్ లో లెక్కల మాస్టారు సుకుమార్ మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చేస్తుండగా ఒక సీన్ షూటింగ్ సమయంలో దిల్ రాజు గారికి నాకు గొడవైంది. ఆ సీన్ మాన్టేజ్ కోసం మరోసారి చేద్దాం అని అడుగగా ఆయన వద్దన్నారు. ఆ సీన్ సరిగ్గా రాకుండా సినిమా ఎలా విడుదల చేస్తామని అన్నాను. వద్దు ఇప్పటికే చాల డబ్బు ఖర్చు అయిందన్నారు. దీనితో నాకు కోపం వచ్చింది. మీరు ప్రొడ్యూసర్ అయితే నాకేంటి అంటూ గొడవ పడ్డాను. ఆ తర్వాత కాస్త కోపం తగ్గగానే ఆలోచించి ఇక వెంటనే వెళ్లి నేనే రాజుగారి కాళ్ళు పట్టేసుకున్నాను. ఆ సీన్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి.. అనగానే సరే చేసుకోమని దిల్ రాజు అన్నట్లు సుకుమార్ తెలిపారు. ఒక సినిమా బాగా రావడం కోసం నేను దేనికైనా కాంప్రమైజ్ అవుతానంటూ సుకుమార్ చెప్పిన విషయం బాగా ట్రెండ్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here