Faria Abdullah : పెళ్లి కాకుండానే పిల్లలు కావాలంటున్న హీరోయిన్.. నీకేం పోయేకాలం అంటున్న నెటిజన్లు

- Advertisement -

Faria Abdullah : ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఏం మాట్లాడుతున్నారో..? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో..? అసలు అర్థం కావడం లేదు. ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ చర్చనీయాంశంగా మారుతున్నారు. మనసులో ఏం దాచుకోకుండా తమ ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తాజాగా ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు. ఫరియా అబ్దుల్లా . జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు దూసుకెళ్తుంది.

ఆ సినిమా తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పాజిటివ్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి పిల్లలు పై సంచలన కామెంట్స్ చేసింది. ఫరియా మాట్లాడుతూ…నాకు మ్యారేజ్ పై అస్సలు నమ్మకం లేదు . ఒకవేళ అయితే అవ్వచ్చు.. కాకపోతే కాదు.. కానీ పిల్లలను మాత్రం కనాలని ఉంది.. నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం’’.

- Advertisement -

“అమ్మ అవుతాను కానీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించాలి. దేవుడు మనకు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. మనం ఎంత మందిని కావాలంటే అంత మందిని ప్రొడ్యూస్ చేయొచ్చు.. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి కదా..? ఒక బిడ్డను పెంచడానికి తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది. అదే నాకు పెద్ద డౌట్.. మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే నాకు భయం’’అంటూ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here