Allu Arjun : ఆ హీరోయిన్ తో ప్రభాస్ సీక్రెట్ ఎఫైర్ బయటపెట్టిన అల్లు అర్జున్

- Advertisement -

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు. అయితే ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్.. ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ చలాకీగా, కొంటెగా ఉంటాడని అందరికీ తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఎవరినైనా ఆటపట్టించడంలో ఆయన తర్వాతే మరెవరైనా. అయితే ఏకంగా ప్రభాస్‌ని ఈవెంట్‌లో ఆటపట్టించడం విశేషం.

కెరీర్‌ ప్రారంభంలో బన్నీ, ప్రభాస్‌ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. మొదట ప్రభాస్‌ కెరీర్‌ ప్రారంభించినా, అల్లు అర్జున్ తో మంచి అనుబంధం ఉంది. బన్నీ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ మూవీకి సీక్వెల్ గా ‘ఆర్య 2’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ లో చాలామంది ప్రముఖ దర్శకులతో పాటు హీరో ప్రభాస్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ రచ్చ రచ్చ అయ్యింది. ప్రభాస్‌ మాట్లాడుతుండగా, బన్నీ చేసిన పని అందరిని అవాక్కయ్యేలా చేసింది. అంతేకాదు డార్లింగ్‌ స్పీచ్‌ ఆపేసి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నాకు కూడా ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. నా సినిమాల కంటే అల్లు అర్జున్ కి మంచి పాటలు అందించారు. అయిన కూడా నేను అంతగా ఫీల్ అవ్వను.

- Advertisement -

ఆ తర్వాత కాజల్‌ గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్. `కాజల్‌తో నేను ఇప్పుడే పనిచేశాను` అని చెప్పగానే, మైక్‌ తీసుకున్న బన్నీ `కాజల్‌ని మర్చిపోతారా` అంటూ వెరైటీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. అన్నీ అబద్దాలే.. కాజల్‌ వెరీ హార్డ్ వర్కర్, సూపర్బ్ పర్ఫార్మర్‌, మొన్న ఇరవై రోజు స్విట్జర్లాండ్‌లో పనిచేశామని తెలిపారు ప్రభాస్. సినిమా గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడున్న జనాలందరూ ఎవరికి వారే ప్రభాస్ కి హీరోయిన్ కాజల్ తో సమ్ థింగ్ సమ్ థింగ్ ఏదో నడుస్తుంది అని అరుపులతో గోల గోల చేశారు. దాంతో ప్రభాస్ స్టేజి దిగి కిందకి వెళ్లి పోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here